Rakul Preet Singh: సౌత్‌కి దూరమైతే.. సినిమా ఇండస్ట్రీకి దూరమైనట్టు కాదు.. అంత తేలిగ్గా వదలను
సౌత్‌కి దూరమైనంత మాత్రాన సినిమా ఇండస్ట్రీకి దూరమైనట్టు కాదని అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. అంతే కాదు, ఏజ్ గురించి కెరీర్ లాంజ్‌విటీ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి. మారుతున్న సిట్చువేషన్‌ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయని అంటున్నారు జనాలు. రకుల్ ప్రీత్‌సింగ్ చేతిలో సౌత్ సినిమాలు ఏం ఉన్నాయి? అని గట్టిగా అడిగితే ఇండియన్3 అనే ఆన్సర్ వస్తుంది.
Updated on: May 21, 2025 | 2:50 PM

రకుల్ ప్రీత్‌సింగ్ చేతిలో సౌత్ సినిమాలు ఏం ఉన్నాయి? అని గట్టిగా అడిగితే ఇండియన్3 అనే ఆన్సర్ వస్తుంది. అంతకు మించి దక్షిణాది ప్రాజెక్టులని ఒప్పుకోలేదు మిసెస్ రకుల్.

రీజన్ ఏంటంటే.. ఆఫ్టర్ మేరేజ్ తీసుకున్న లీజర్, ఈ మధ్య కాలంలో నడుం నొప్పి.. బాలీవుడ్ ప్రాజెక్టుల మీద ఫోకస్.. ఇలా రకరకాల జవాబులు వినిపిస్తున్నాయి. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదు రకుల్.

ఆ మాట కొస్తే అసలు కెరీర్‌లోనే బ్రేక్ తీసుకోనంటోందీ లేడీ. సినిమా ఇండస్ట్రీ ప్రారంభమైన కొత్తలో... హీరోయిన్ల కెరీర్ అతి తక్కువ కాలమే ఉంటుందని అనుకునేవారట. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెబుతున్నారు రకుల్.

జస్ట్ నేను చెప్పడమే కాదు, సిట్చువేషన్‌ని గమనించిన వారికి ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుందని అంటున్నారు రకుల్. మనలో టాలెంట్ ఉండాలేగానీ, ఇండస్ట్రీలో అవకాశాలు కోకొల్లలు అని ఒపీనియన్ షేర్ చేసుకున్నారీ బ్యూటీ.

ఏజ్‌తో సంబంధం లేకుండా సినిమా రంగంలో రాణించాలనుకుంటున్నారట రకుల్. అంతే కాదు, తనను అభిమానించే యువతరం తనను చూసి స్ఫూర్తి పొందేలా కేరక్టర్స్ ని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు.




