- Telugu News Photo Gallery Cinema photos Hrithik Roshan, jr ntr war 2 teaser review know the details here
war2: ఫుల్ స్వింగ్‌లో తారక్.. టీజర్ చూస్తే అర్థమైపోతుంది
ఆగస్టు 14న వచ్చే కూలీ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి.. అదే రోజున వచ్చే వార్2 సినిమా ప్రమోషన్లలో ఎందుకింత నిదానంగా వ్యవహరిస్తున్నారనే మాటలకు చెక్ పడింది. రావడంలో ముందూ వెనుకా ఉండొచ్చేమోగానీ, ఒన్స్ ఐ స్టెప్ ఇన్.. అంటూ తన పవర్ ఏంటో చూపించే ప్రయత్నం చేశారు తారక్... ఇంతకీ ఆయన పుట్టినరోజున రిలీజ్ అయిన వార్2 టీజర్ ఎలా ఉంది?
Updated on: May 21, 2025 | 3:14 PM

ఎన్టీఆర్ నోట కబీర్ అనే పిలుపు వినగానే ఒక్కసారిగా గూస్‌బంప్స్ వచ్చేశాయని అంటున్నారు ఫ్యాన్స్. తారక్, హృతిక్ పోటాపోటీగా యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తుంటే, ఇది కదా మేం కోరుకున్న ప్రాజెక్ట్ అంటూ పొంగిపోతున్నారు.

యష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్శ్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అత్యంత భారీ స్థాయి, అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్, ఇంటెన్స్ డ్రామా, డార్క్ కేరక్టర్లు.. ఒక్కటేంటి? ఎన్నెన్నో విషయాలను రివీల్ చేసింది టీజర్.

కనురెప్ప వేయనీయనంత షార్ప్ గా కట్ చేశారు టీజర్‌ని. 150 రోజులు ఈ మూవీ కోసం వర్క్ చేశారు మేకర్స్. గతేడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లింది వార్2.

మన లొకేషన్లతో పాటు స్పెయిన్, ఇటలీ, అబుదాబీ, జపాన్, రష్యాలోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఇంకో పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా హృతిక్ - తారక్ మధ్య వచ్చే పాట. ఇద్దరి డ్యాన్సింగ్ స్కిల్స్ కి అద్దం పట్టే పాట.

జూన్ నెలాఖరున ఆ పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఎడిటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఆగస్టు 14న థియేటర్లలో మోత మామూలుగా ఉండదని అంటున్నారు తారక్ ఫ్యాన్స్. తారక్ బర్త్ డేని హృతిక్ కూడా అంతే ఇష్టంగా సెలబ్రేట్ చేయడం వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.




