AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాగి గ్లాసులో నీళ్లు ఓకే.. రాగిపాత్రలో పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి

రాగి గ్లాసులో నీళ్లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, పాలు తాగితే ఏమతుందో తెలుసా..? రాగి పాత్రలో ఏవైనా ద్రవాలు నిల్వ చేసి తాగితే మంచిదే. ముఖ్యంగా నీరు తాగడం చాలా మంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు, పెద్దలు తరచూ చెబుతూనే ఉంటారు.. అయితే రాగి గ్లాసులో పాలు తాగితే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..

రాగి గ్లాసులో నీళ్లు ఓకే.. రాగిపాత్రలో పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి
Copper Glass
Jyothi Gadda
|

Updated on: May 20, 2025 | 9:29 PM

Share

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, ఎప్పుడు తాగాలి. ఎంత తాగాలనే విషయాల గురించి చాలా మందిచెబుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఏ గ్లాసులో తాగాలనేది కూడా అతి ముఖ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాగి గ్లాసులో నీళ్లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, పాలు తాగితే ఏమతుందో తెలుసా..? రాగి పాత్రలో ఏవైనా ద్రవాలు నిల్వ చేసి తాగితే మంచిదే. ముఖ్యంగా నీరు తాగడం చాలా మంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు, పెద్దలు తరచూ చెబుతూనే ఉంటారు.. అయితే రాగి గ్లాసులో పాలు తాగితే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..

రాగి పాత్రలో లేదా గ్లాస్ లో నిల్వ చేసి నీటిని తాగడం ఆరోగ్యకరం. కానీ, అలాంటి రాగి పాత్రలో తాగకూడని కొన్ని పానీయాలు, తీసుకోకూడని ఆహార పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా పాలతో పాటు సంబంధిత ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లో రాగి పాత్రలు లేదా గిన్నెల్లో నిల్వ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పాలు లేదా వాటి ఉత్పత్తులను రాగి పాత్రలో ఎక్కువసేపు నిల్వ ఉంచడం మంచిది కాదు. పాలలోని ఖనిజాలు, విటమిన్లతో రాగి చర్యలు జరుపుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు.

రాగి అనేది లోహం. కాబట్టి వాటితో తయారు చేసే గ్లాస్ లేదా పాత్రలో ఉంచిన పాలను తీసుకుంటే వికారం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పాలు లేదా వాటి నుంచి వచ్చే పెరుగును కూడా రాగి పాత్రలో వేసుకుని తీసుకుంటే ప్రతిచర్యలు జరుగుతాయి. ఫలితంగా జీర్ణసమస్యలకు దారి తీస్తాయి. రాగితో తయారు చేసే పాత్రలు, గ్లాసుల్లో పాలు లేదా పెరుగు నిల్వ చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, రాగి పాలలోని ఆమ్ల భాగాలతో చర్య జరుపుతుంది. ముఖ్యంగా పాలు కాస్తా పుల్లగా ఉంటే రాగి పాత్రలో ఎక్కువసేపు ఉంచితే అవి ప్రతిచర్య ఏర్పరిచి రాగి అయాన్స్ విడుదలవుతాయి. ఇది జీర్ణ సమస్యలు, వికారం, వాంతులకి కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..