AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Healthy Fruit: ఆకు, రసం, కాయ వీటిలో ఏది తీసుకున్న మస్తు ఎనర్జీ వస్తుంది..! ఇంకా ఎన్నో లాభాలు..!

వేసవి వచ్చిందంటే మామిడితోనే మొదలవుతుంది. మామిడి పండు మాత్రమే కాదు, మామిడి ఆకు, రసం, కాయ.. ఇలా అన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. పండ్ల మహారాజు అని పేరున్న ఈ పండులో ఎన్నో మంచి పోషకాలు దాగి ఉన్నాయి. దీనిలో విటమిన్ A, C, E లాంటి విటమిన్లతో పాటు ఐరన్, పొటాషియం, మాంగనీస్, ఫైబర్ లాంటి శరీరానికి కావాల్సినవన్నీ పుష్కలంగా ఉంటాయి.

Summer Healthy Fruit: ఆకు, రసం, కాయ వీటిలో ఏది తీసుకున్న మస్తు ఎనర్జీ వస్తుంది..! ఇంకా ఎన్నో లాభాలు..!
Mango Tree
Prashanthi V
|

Updated on: May 21, 2025 | 2:41 PM

Share

మామిడిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా చేసి పాలతో కలిపి తాగితే శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. పాలు ప్రోటీన్లకు కేంద్రమైతే, మామిడి విటమిన్లకు నిలయం. వీటిని కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ కలయిక మంచి ఆరోగ్య లాభాలను అందిస్తుంది.

తాజా మామిడి గుజ్జుతో చేసిన రసం తాగడం ద్వారా శరీరానికి కావాల్సిన కాల్షియం, విటమిన్ D బాగా అందుతాయి. ఈ పోషకాలు ఎముకల బలానికి చాలా అవసరం. వారానికి ఒకసారైనా మామిడి జ్యూస్ తాగితే శరీరానికి శక్తి, ఉత్సాహం వస్తుంది.

అన్ని పండ్లను భోజనంతో కలిపి తినకూడదని చాలా మంది అంటారు. కానీ మామిడిని మాత్రం భోజన సమయంలో తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది అజీర్తిని దూరం చేస్తుంది. అయితే మామిడి పూర్తిగా పండినదే తీసుకోవాలి. పచ్చి మామిడి అయితే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి కలిగించవచ్చు.

మామిడి ఆకులను శుభ్రంగా కడిగి వాటిని బాగా నూరి ఆ మిశ్రమాన్ని మీగడలో కలిపి మొహానికి రాసుకుంటే చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలు, నల్లని మచ్చలు తగ్గిపోతాయి. ఇది సహజమైన ఫేస్ మాస్క్‌లా పని చేస్తుంది. వారానికి మూడు సార్లు ఇలా చేస్తే మొహం మెరిసిపోతుంది.

పండిన మామిడిని పాలలో కలిపి తీసుకోవడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వేసవిలో ఇది శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హాని నుంచి కాపాడతాయి. అలాగే బీటాకెరోటిన్ చర్మ కణాలను కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది.

ఆయుర్వేదం ప్రకారం మామూలుగా పండ్లు ఖాళీ కడుపుతో తినాలని చెబుతారు. కానీ మామిడిని భోజనంతో కలిపి తినడం వల్ల కొన్ని ప్రత్యేక లాభాలున్నాయని పాత వైద్యం అంటుంది. అయితే తగినంతగా తీసుకోవడమే మంచిది. మరీ ఎక్కువ మామిడి తింటే షుగర్ లెవెల్స్ పెరగొచ్చు.

మామిడి తినడం వల్ల శరీరానికి శక్తి, చర్మానికి మెరుపు, మనసుకు ఉల్లాసం అన్నీ ఒకేసారి లభిస్తాయి. కానీ మామిడిని కూడా ఎక్కువగా తినకూడదు. సరిగ్గా, సరైన టైమ్‌లో, తగినంత మోతాదులో తీసుకుంటే ఇది ఆరోగ్యానికి వరంగా మారుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..