AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధర ఎక్కువని బాదం తినట్లేదా..? అయితే ఇవి తినండి.. అవే లాభాలుంటాయి..!

వేరుశెనగలు చిన్నవైనప్పటికీ శక్తివంతమైన పోషకాలతో నిండివున్న ఆహార పదార్థం. ఇవి మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా నానబెట్టి తీసుకుంటే వాటిలోని పోషక విలువలు మరింత ప్రభావవంతంగా మారతాయి. రోజూ ఉదయాన్నే తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే నానబెట్టిన వేరుశెనగలను అలవాటుగా మార్చుకోవడం ఉత్తమం.

ధర ఎక్కువని బాదం తినట్లేదా..? అయితే ఇవి తినండి.. అవే లాభాలుంటాయి..!
Boiled Peanuts
Prashanthi V
|

Updated on: May 21, 2025 | 3:06 PM

Share

వేరుశెనగల్లో సహజంగా ఉన్న కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అవసరమైన శక్తిని నింపుతాయి. వీటిని నీటిలో నానబెట్టి తీసుకుంటే తేలికగా జీర్ణమై శక్తిని త్వరగా అందిస్తాయి. శ్రమతో కూడిన పనులు చేసే వారికి ఇవి మంచి శక్తివంతమైన ఆహారంగా పనిచేస్తాయి. ఈ చిన్నపాటి గింజల్లో పొటాషియం, ఐరన్, జింక్, సెలీనియం, కాపర్, కాల్షియం వంటి అనేక ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో, రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

నానబెట్టిన పల్లీలు మానవ శరీరంలోని కండరాలను బలపరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి కండరాల క్షీణతను నివారించడంలో సహకరిస్తాయి. వ్యాయామం చేస్తున్న వారికి వీటి వినియోగం మరింత మేలు చేస్తుంది.

పిల్లలు పెద్దలు ఉదయం పూట నానబెట్టిన వేరుశెనగలను తీసుకుంటే మెదడు చురుకుగా పని చేస్తుంది. వీటిలోని విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు మెదడు కణాలకు ఆహారంగా పని చేస్తాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

పల్లీలను నానబెట్టి తినడం వల్ల చర్మం నిగారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇవి శరీరంలో నుండి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అందువల్ల వయస్సు ప్రభావాలు ఆలస్యం అవుతాయి.

వేరుశెనగల్లోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల పటుత్వాన్ని పెంచడంలో కీలకంగా పని చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను తగ్గించడంలో ఇది సహజ పరిష్కారం.

నానబెట్టిన పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల వెన్ను సంబంధిత నొప్పుల నుంచి ఉపశమనం లభించవచ్చు. బెల్లంలో ఉండే సహజ శక్తివంతమైన పదార్థాలు కలవడం వల్ల ఇది ఒక మంచి నేచురల్ రెమెడీగా పని చేస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారికి నానబెట్టిన వేరుశెనగలు ఒక వరంలా పని చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో మధుమేహ నియంత్రణకు ఇది సహజ చికిత్సగా పరిగణించవచ్చు.

అనేక పోషకాల సమ్మేళనంగా ఉండే వేరుశెనగలను నానబెట్టి తీసుకుంటే శరీరానికి మరింత ఉపయోగకరంగా మారతాయి. ప్రతిరోజూ ఉదయం కొద్ది మోతాదులోనైనా తీసుకుంటే ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే కాదు.. అనేక వ్యాధుల నుంచి నివారణ కూడా సాధ్యమవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..