AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves Benefits: షుగర్ ఉన్నవారు ఈ ఆకులు తింటే.. కంట్రోల్ లో ఉంటుంది..!

మన వంటల్లో మామూలుగా వాడే కరివేపాకు ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన గుణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి కరివేపాకులను నమిలి తింటే శరీరానికి చాలా లాభాలు వస్తాయి. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక ఆయుధంగా కూడా పని చేస్తుంది.

Curry Leaves Benefits: షుగర్ ఉన్నవారు ఈ ఆకులు తింటే.. కంట్రోల్ లో ఉంటుంది..!
Curry Leaves
Prashanthi V
|

Updated on: May 21, 2025 | 3:23 PM

Share

తాజా కరివేపాకుల్లో పోషకాలు, ముఖ్యంగా ఫైబర్ సహజ ఎంజైములు ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగుల పని తీరును మెరుగుపరిచి ఆహారాన్ని వేగంగా జీర్ణం అయ్యేలా సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం ఈ ఆకులను నమిలి తింటే పేగులు చక్కగా పని చేస్తాయి. దీని వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రావు.

కరివేపాకులో ఉండే సహజ క్రియాశీల పదార్థాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్‌ ను పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను రాకుండా చూసుకోవాలంటే రోజూ ఈ ఆకులను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

పచ్చి కరివేపాకులను ఉదయాన్నే పరగడుపున తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సరిగా ఉంటాయి. ఇది మధుమేహ బాధితులకు ఒక సహజ మార్గంగా పని చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ శోషణను నియంత్రించడం ద్వారా ఇది రక్తంలో చక్కెర పెరగకుండా చేస్తుంది.

ఈ ఆకుల్లో ఉండే ప్రత్యేక పదార్థాల వల్ల శరీరంలో కొవ్వు కణాలు ఎక్కువగా పేరుకుపోవడం తగ్గుతుంది. ఇవి యాంటీ ఒబేసిటీ లక్షణాలను కలిగి ఉండడం వలన బరువు తగ్గాలనుకునే వారికి మంచి సహాయం అందిస్తుంది. ఫిట్‌గా ఉండాలనుకునే వారు దీన్ని రోజూ తీసుకుంటే మంచిది.

పచ్చి కరివేపాకులను ఖాళీ కడుపుతో తింటే.. తర్వాత తినే ఆహారంలోని ముఖ్యమైన పోషకాలను శరీరం చక్కగా గ్రహించగలుగుతుంది. దీనివల్ల శక్తి పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. అలాగే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇది శరీరానికి మొత్తం ఆరోగ్యాన్ని అందించడంలో తోడ్పడుతుంది.

పచ్చి కరివేపాకులు చిన్న ఆకులా కనిపించవచ్చు కానీ అందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు చాలా గొప్పవి. ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున కొన్ని ఆకులను నమిలి తింటే మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని సహజంగా పొందవచ్చు. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, షుగర్ కూడా అదుపులో ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్