- Telugu News Photo Gallery Health cinnamon powder may reduce cholesterol levels instantly know amazing benefits
పాలలో చిటికెడు ఈ మసాలా పొడి కలిపి తాగితే.. ఒంట్లో కొవ్వు కరగడమే కాదు, ఇంకెన్నో లాభాలు..
చాలా మంది ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువు మిమ్మల్ని లావుగా మార్చడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు గురి చేస్తుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలి... అధిక బరువు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీనివల్ల గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలని, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు.. కానీ బరువు తగ్గడం అనుకున్నంత సులభం కాదు. బరువు తగ్గడానికి చాలా మంది జిమ్, వ్యాయామం, యోగా, డైట్ వంటి వివిధ వ్యాయామాలు చేస్తారు. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.. కాబట్టి ఇలా పాలు తాగడం వల్ల బరువు తగ్గి స్లిమ్‌గా కనిపిస్తారు.
Updated on: May 21, 2025 | 3:04 PM

అవును, ప్రతిరోజూ పాలు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతారు. కానీ మన వంటింట్లో ఉండే ఒక మసాలాను పాలలో కలుపుకుని తీసుకుంటే నెలలోపు మీరు కోరుకున్న బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు.

ఆ మసాలా దాల్చిన చెక్క. అవును, ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు పాలలో కలిపి తాగితే బొడ్డు కొవ్వు సులభంగా కరిగిపోతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ పాలు తాగితే మంచి నిద్ర మీ సొంతమవుతుంది.

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థని పెంచి బ్లడ్ షుగర్ లెవల్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ పాలని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పాలలోని కాల్షియం, దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో కలిసినప్పుడు ఎముకల్లో బలం పెరుగుతుంది. దీంతో పాటు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి.

దాల్చిన చెక్క పొడి కలిపిన పాలని తాగితే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. దాల్చిన చెక్క పొడిలోని గుణాల కారణంగా జీర్ణ వ్యవస్థ పెరుగుతుంది. బ్లోటింగ్ తగ్గుతుంది. దీంతో పాటు బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఫిజికల్ హెల్త్‌తో పాటు బ్రెయిన్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. పాలలో ఈ పొడిని కలపడం మంచి రుచి చేరుతుంది.

ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరిగించాలి. తర్వాత మరిగించిన పాలను కాసేపు చల్లార్చి ఆ తరువాత తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు సులభంగా తగ్గుతుంది. ఈ పాలు తాగితే మెటబాలిజం పెరుగుతుంది. దీంతో ఫ్యాట్ తగ్గడం, బరువు తగ్గడం జరుగుతుంది.




