విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మూడు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ, కొడవ సంప్రదాయాలలో జరిగిన ఈ వేడుకలో సరదా ఆటలు, మ్యూజికల్ నైట్స్‌తో సంగీత్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ విరోష్ పెళ్లి సంబరాలకు మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహిస్తారు. త్వరలో వారు షూటింగ్ తిరిగి మొదలుపెడతారు.