AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International tea day: టీ తాగే సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..

భారతదేశంలో టీకి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. టీ ప్రియులకు టీకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం మే 21వ తేదీన అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని టీ ప్రియుల కోసం జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఉద్దేశ్యం టీ చరిత్ర, ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం. ఈ రోజున ప్రజలు టీ తాగేటప్పుడు 5 సాధారణ తప్పులు చేస్తారు.. అవి వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

International tea day: టీ తాగే సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..
International Tea Day
Surya Kala
|

Updated on: May 21, 2025 | 11:10 AM

Share

భారతదేశంలో చాలా మందిని కలిపే ఒక విషయం ఉంటే.. అది టీ. ఉదయం ప్రారంభం అయినా, సాయంత్రం అలసట అయినా, స్నేహితులతో కబుర్లు చెప్పినా, ఒంటరిగా గడిపినా, ప్రతి సందర్భంలోనూ టీ మనకు తోడుగా ఉంటుంది. చాలా మందికి టీ అనేది కేవలం ఒక పానీయం కాదు, ఒక అనుభూతి. అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని టీ ప్రియులకు మాత్రమే జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం మే 21న జరుపుకుంటారు. అయితే రోజూ ఎంతో ఆసక్తిగా తాగే టీలో చేసే కొన్ని సాధారణ తప్పులు మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

అవును టీకి బానిసై.. దానిని సరిగ్గా తాగకపోవడం శరీరానికి హానికరం. టీని తరచుగా తాగడం వల్ల, ఖాళీ కడుపుతో తాగడం వల్ల, లేదా ఎక్కువ టీ ఆకులను జోడించడం వల్ల టీ తాగే అలవాటు క్రమంగా శరీరానికి హాని కలిగిస్తుంది. మీరు కూడా టీ ప్రియులైతే.. టీ తాగేటప్పుడు ఈ 5 సాధారణ తప్పులు చేయకండి..

టీ తాగేటప్పుడు చేసే 5 సాధారణ తప్పులు

ఖాళీ కడుపుతో టీ తాగడం కొంతమంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగుతారు.. ఇది హానికరం. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అసిడిటీ సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇది గ్యాస్, బర్నింగ్ సెన్సేషన్, మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. కనుక టీ తాగే ముందు గోరువెచ్చని నీరు త్రాగండి లేదా ఏదైనా పండు తినండి.

ఇవి కూడా చదవండి

ఎక్కువగా టీ తాగడం టీ ప్రియులు రోజుకు 4 , 5 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు టీ తాగితే.. శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. దీని వలన నిద్ర లేకపోవడం, భయము, అలసట కలుగుతుంది. అందువల్ల రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగవద్దు. రాత్రి ఆలస్యంగా టీ తాగకుండా ఉండండి.

ఘాటైన లేదా మరిగించిన టీ తాగడం కొంతమంది ఆహ్లాదకరమైన వాసన పొందడానికి, దాని రుచిని పెంచడానికి టీని 10-15 నిమిషాలు మరిగిస్తారు. దీని ఉండే టానిన్ , కెఫిన్‌ను పెంచుతుంది. ఇవి జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, టీని ఎక్కువగా మరిగించి.. చాలా చిక్కగా చేయకండి.

భోజనం చేసిన వెంటనే టీ తాగడం కొంతమందికి ఆహారం తిన్న తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల ఆహారంలో ఉండే ఐరెన్, పోషకాల శోషణ తగ్గుతుంది. మీరు టీ తాగాలనుకుంటే భోజనం చేసిన తర్వాత 30-45 నిమిషాల తర్వాత మాత్రమే తాగండి.

ఎక్కువ చక్కెర జోడించడం కొంతమందికి తీపి టీ అంటే ఇష్టం. దీంతో టీలో అవసరమైన దానికంటే ఎక్కువ చక్కెరను కలుపుకుంటారు. అయితే అతిగా తీపి టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి, ఊబకాయం, మధుమేహం సమస్యలు వస్తాయి. వీలైతే టీలో చక్కెరను తగ్గించండి లేదా బెల్లం, తేనె వంటి వాటిని ఉపయోగించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)