AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. సుఖ నిద్ర కోసం ఈ వాస్తు టిప్స్ ట్రై చేయండి..

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ దిన చర్యలో తగినంత నిద్ర కూడా ముఖ్యమే. తగినంత నిద్రపోవడం వలన శారీరక అలసట తీరి ఉత్సాహంగా ఉండడమే కాద.. ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో నిద్ర లేమి సమస్య నుంచి ఉపశమం కోసం రాత్రి పడుకునే ముందు కొన్ని వాస్తు నియమాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు ఆ నియమాలను గురించి తెలుసుకుందాం.. తద్వారా మీరు మంచి నిద్ర పొందవచ్చు.

Vastu Tips: నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. సుఖ నిద్ర కోసం ఈ వాస్తు టిప్స్ ట్రై చేయండి..
Vastu Tip S
Surya Kala
|

Updated on: May 21, 2025 | 9:33 AM

Share

ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం వలన ఇంట్లో ఆనందం నెలకొంటుంది. మంచి వాతావరణం ఏర్పడుతుందని అంటారు. అయితే ఆరోగ్యం కోసం వాస్తు చిట్కాలున్నాయి. వీటిని పాటించడం వల్ల మీరు నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. మంచి నిద్ర కోసం పాటించాల్సిన వాస్తు చిట్కాలను గురించి తెలుసుకుందాం..

మానసిక ప్రశాంతత

నిద్ర లేమి సమస్య నుంచి ఉపశామనంకోసం.. నిద్రపోయే ముందు మనసుకుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మంచి పుస్తకం చదవడం, నీతి కథలు వినడం, మంచి సంగీతం వినడం వంటివి చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.

నిద్రించడానికి సరైన దిశ

ఉత్తర దిశలో తల పెట్టి నిద్రపోకూడదు ఎందుకంటే అలా చేయడం వల్ల మీ పాదాలు దక్షిణ దిశ వైపు ఉంటాయి. ఇది అస్సలు శుభప్రదంగా పరిగణించబడదు. దీనితో పాటు మంచం ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉండకూడదని గుర్తుంచుకోండి. ఈశాన్య దిశలో ఉన్న మంచం మీద నిద్రపోతే అటువంటి వ్యక్తులు నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.

ఇవి కూడా చదవండి

నిద్రలేమి సమస్య పరిష్కారానికి

నిద్రపోతున్నప్పుడు కొన్ని రకాల వస్తువులను తల దగ్గర ఉంచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం పడుకునే ముందు ఒక రాగి పాత్రలో నీటిని నింపి తల దగ్గర పెట్టుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత.. ఈ నీటిని ఒక మొక్కలో పోయాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు దిండు కింద ఆకుపచ్చ యాలకులు పెట్టుకుని కూడా నిద్రపోవచ్చు. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య పరిష్కారమవుతుంది.

పడుకునే ముందు ఈ పనులు చేయండి.

పడుకునే ముందు మీ ఇష్ట దేవుడిని తలచుకుంటూ (ఇష్టమైన దేవత) ధ్యానం చేయాలి. దీనితో పాటు నిద్రపోతున్నప్పుడు మనస్సులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలను తీసుకురావద్దు. అందుకు బదులుగా మీరు ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలను చేస్తూ.. నిద్రపోవాలి. దీనితో పాటు నిద్రపోయే ముందు చేతులు, కాళ్ళు కడుక్కోవడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది.

ఈ వస్తువులను దూరంగా పెట్టండి

సెల్ ఫోన్, ట్యాబ్ మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులను మీరు నిద్ర పోయే మంచం దగ్గరగా ఉంచుకుని నిద్రపోకండి. నిద్రపోవడానికి ముందు ఎక్కువసేపు సెల్ ఫోన్, ట్యాబ్ వంటి వాటిని ఉపయోగించవద్దు. ఇలా చేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. దీనితో పాటు నిద్రపోయేటప్పుడు తోలు వస్తువులను మీ దిండు దగ్గర ఎప్పుడూ ఉంచుకోకూడదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి హానికరం కూడా కావచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు