Budha Gochar: ఈ నెల 23న రాశిని మార్చుకోనున్న బుధుడు.. ఈ రెండు రాశుల వ్యాపారస్తులకు లాభాలే లాభాలు..
గ్రహాలకు రాకుమారుడు బుధుడు మే 23 (బుధ గోచార 2025)న తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ రోజున బుధుడు వృషభ రాశిలో అడుగు పెట్టనున్నాడు. వృషభ రాశిలో వ్యాపార దాత అయిన బుధుడి సంచారంతో మొత్తం రాశులపై ప్రభావం చూపిస్తుంది. బుధుడి రాశి మార్పు అనేక రాశులకు కొత్త ఉదయాన్ని తెస్తుంది. ఈ రాశుల వారు వ్యాపారం , ఉద్యోగంలో విజయం సాధించే అవకాశం ఉంది.

బుధవారం గ్రహాల రాకుమారుడు బుధుడికి అంకితం చేయబడింది. ఈ శుభ సందర్భంగా గణేశుడిని మరియు బుద్ధుడిని పూజిస్తారు. అలాగే బుధవారం నాడు శ్రీకృష్ణుడితో పాటు రాధా రాణిని కూడా పూజిస్తారు. గణేశుడిని పూజించడం ద్వారా, భక్తుడు అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం పొందుతాడు. దీనితో పాటు ఆదాయం, ఆయుస్సు, అదృష్టం కూడా పెరుగుతుంది.
కెరీర్ , వ్యాపారంలో వృద్ధి మరియు పురోగతి కోసం బుధవారం నాడు గణేశుడిని పూజించి ధ్యానం చేయాలని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. గణేశుడిని పూజించడం వల్ల జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది. బుధుడు మే 23, 2025న మధ్యాహ్నం 1:05 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో జూన్ 6, 2025 వరకు బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా రెండు రాశుల వ్యక్తుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం
మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై బుధ భగవానుని ఆశీస్సులు కురిపిస్తాయి. బుధుడి ఆశీస్సులతో మీరు వ్యాపారంలో లాభం పొందుతారు. వీరు కొత్త పనిని ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే వీరు వ్యాపారంలో కొత్త భాగస్వాములను పొందుతారు. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది శుభ సమయం. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాలను పొందవచ్చు. ఉద్యోగ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలలో వీరు విజయం సాధిస్తారు. వ్యక్తిగత నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. కొత్త ఉద్యోగ ఆఫర్లు రావచ్చు. జీతంలో కూడా పెరుగుదల ఉంటుంది. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం శుభప్రదం.
వృషభ రాశి: బుధుడు స్థానంలో మార్పు కారణంగా.. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి జీవితాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం కోసం కొత్త భాగస్వామిని దొరికే అవకాశం ఉంది. రుణం మంజూరు కావచ్చు. ఆగిపోయిన పనులు మళ్ళీ జరిగే అవకాశం ఉంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. బుధుడు అనుగ్రహం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. బుధ గ్రహం ఆశీర్వాదం వల్ల వీరు పనిలో విజయం సాధిస్తారు. గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి, బుధవారం నాడు ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను దానం చేయండి. ఆవును సేవించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








