అక్కడ హనుమంతుడే ఆర్థోపెడిక్.. మూలికతో ఎముకల వ్యాధి నయం.. అంబులెన్స్ లో కూడా వచ్చే భక్తులు
హిందువులు పూజించే దేవుళ్లలో హనుమంతుడు ఒకరు. రామ భక్త హనుమాన్ చిరంజీవి. కనుక కలియుగం కూడా జీవించి ఉన్నారని.. ఎక్కడ రామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ అయన ఉంటారని భక్తులకు విశ్వాసం. కోరి కొలిస్తే కోర్కెలు తీర్చే దైవం కనుక సంకట మోచనుడు అని అంటారు. మన దేశంలో పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా గల్లీగల్లీ కి ఒక హనుమంతుడి ఆలయమో లేక విగ్రహమో ఉంటుంది. మహా మహిమనిత్వమైన ఆంజనేయ స్వామి ఆర్థోపెడిక్ వైద్యుడిలా పనిచేస్తాడని నమ్మకం. ఆ అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉందంటే..

మధ్యప్రదేశ్ కట్ని జిల్లా నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ముహాసాలో ఉన్న హనుమంతుడి ఆలయం ప్రపంచ ప్రసిద్దిగాంచింది. ఈ ఆలయం మంగళ, శనివారాల్లో భారీ రద్దీ నెలకొంటుంది. ఈ ఆలయంలో ఉన్న మూలికలను నమలడం ద్వారా విరిగిన ఎముకలు నయమవుతాయని నమ్ముతారు. వైద్యులు విరిగిన ఎముకలను కలపడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వేయమని సలహా ఇచ్చిన బాధితులు సైతం ఇక్కడకు వచ్చి ఆ మూలికను తీసుకున్నారని.. వారి ఎముకలు జాయింట్ అయ్యాయని స్థానికులు చెబుతారు. ఆ తరువాత వైద్యులు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మనుషుల ఎముకల సమస్యలు మాత్రమే కాదు జంతువుల ఎముకలు కూడా ఇక్కడ మూలికలు తిన్న తర్వాత కలిసిపోయాయి.
స్ట్రెచర్లపై , అంబులెన్స్‌లలో కూడా వచ్చే రోగులు
మంగళ, శనివారాల్లో ఇక్కడ భక్తులు బారులు తీరతారు. పొడవైన క్యూల్లో వేచి ఉంటాయి. అంతేకాదు రోగులు స్ట్రెచర్‌పై, అంబులెన్స్‌లో విరిగిన ఎముకలతో ఆర్థోపెడిక్ డాక్టర్ హనుమంతుడి చేసే చికిత్స కోసం ఈ ఆలయానికి వస్తారు. ఇక్కడికి వచ్చిన బాధితులు అందరూ స్వస్థత పొంది తిరిగి వెళతారని నమ్మకం.
40 సంవత్సరాలుగా చికిత్స పొందుతున్న భక్తులు
ఈ ఆలయ చరిత్ర లోకి వెళ్తే.. ఈ ఔషధాన్ని 40 సంవత్సరాల క్రితం ఒక సాధువు ఈ ఆలయ పూజారికి ఇచ్చాడట. ఆ తరువాత.. ఆలయ పూజారి సుఖ్‌మాన్ లాల్ జీ భక్తులకు చికిత్స చేయడం ప్రారంభించారు. పుజారీ ఇచ్చిన మూలికను తీసుకున్న భక్తులకు ఉపశమనం లభించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా క్రమంగా దేశమంతటా వ్యాపించింది. ఇప్పుడు ఈ ఆలయంలో పుజారీ పాండా శర్మన్ పటేల్ బాధితులకు ములికను ఇస్తాడు.
ఔషధం (మూలిక) ఎలా ఇస్తారంటే
ఇక్కడికి వచ్చే భక్తులను మొదట రామ నామాన్ని జపించమని అడుగుతారు. తరువాత కళ్ళు మూసుకోమని చెప్పి.. వారి నోటిలో కొంత మూలిక వేసి తినిపిస్తారు. ఈ మూలికను నమిలి తినాలి. దీని తరువాత రోగిని ఇంటికి పంపుతారు. ఇక్కడికి వచ్చి దేవుడిచ్చిన మందు తిన్న వారికి 100% ఉపశమనం లభిస్తుందని అంటారు. అందుకే ప్రతి మంగళవారం, శనివారం ఈ ఆలయంలో కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. ఎముకలకు సంబంధించిన ఇబ్బంది పడేవారు ఈ మూలిక తినడానికి గంటల తరబడి వేచి ఉంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








