Viral Video: గాయపడిన కుక్కకి వైద్యం కోసం ఇద్దరు బాలుర తపన.. ఈ పిల్లలను చూసి ఎంతైనా నేర్చుకోవాలంటున్న నెటిజన్లు..
ప్రస్తుతం మనిషిలో మానవత్వం మాయమైపోతుందని.. అసలు ప్రపంచంలో మానవత్వం అనే పదానికి విలువ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్వార్థపరులని, ఇతరుల బాధలకు, కష్టాలకు చాలా అరుదుగా స్పందిస్తారని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూసినప్పుడు.. ప్రపంచంలో ఎన్ని దారుణమైన సంఘటలు జరిగినా ఇంకా ఇలా ఉన్నాం అంటే కొంతమంది చేసే పుణ్యకార్యలే అని అంటారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో. ఇందులో ఇద్దరు చిన్నారులు గాయపడిన కుక్కకు చికిత్స చేయించడానికి పడిన తపన నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోందని తరచుగా కామెంట్ వినిపిస్తూనే ఉంది. కొంత మంది అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి బదులుగా.. ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మూగ జంతువులతో కూడా మృగాలను మించి ప్రవర్తిస్తున్న మనుషులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు వైరల్ అయిన వీడియో దీనికి విరుద్ధమైన దృశ్యం కనిపిస్తుంది. ఇద్దరు అబ్బాయిలు గాయపడిన కుక్కను వీల్‌చైర్‌లో తోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూజర్లు ప్రశంసలు కురిపించారు.
ఈ వీడియో janwar.nhi.jaan అనే ఖాతా ద్వారా షేర్ చేయబడింది. ఆ దృశ్యాన్ని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఈ వీడియోలో తాత్కాలిక వీల్‌చైర్‌లో కూర్చున్న కుక్కను చూడవచ్చు. గాయపడిన ఈ కుక్కను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. దీని గురించి రోడ్డుమీద వెళ్తున్న ప్రయాణీకులు చిన్నారులను ప్రశ్నించారు. అసలు ఏమి జరిగిందని అడిగితే.. ఆ కుర్రాల్లో ఒకడు కుక్కకు గాయం అయింది. కనుక మేము కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము” అని బదులిచ్చారు. ఆ వ్యక్తి చిన్న పిల్లలు చేస్తున్న పనికి ప్రశంసించాడు.
View this post on Instagram
ఈ వీడియో లక్షా తొంభై వేలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకోగా.. పిల్లల చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృత ప్రశంసలను పొందింది. ‘ప్రేమ అంటే ఇదే. మూగ జంతువుల బాధకు మనం ఇలా స్పందించాలి.. ఈ పిల్లల చేసిన పని మనందరికీ స్ఫూర్తిదాయకం’ అని అన్నారు. చదువుకుని ఉన్నత పదవులు నిర్వహిస్తూ.. మానవత్వం అన్న మాటను మరచిపోయిన అమానవీయ వ్యక్తులు ఈ పిల్లల నుంచి చాలా నేర్చుకోవాలని మరొకరు వ్యాఖ్యానించారు. మరొకరు, “మా ముద్దుల చిన్న హీరోలు అని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




