AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyeshta Masam: జ్యేష్ట మాసంలో ఈ పనులు చేస్తే జాతక దోషం.. ఈ ఆహారం తింటే వ్యాధుల బారిన పడతారట..

హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసం మూడవ నెల. ఉత్తరాదివారికీ ఇప్పటికే జేష్ఠ మాసం నడుస్తోండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగు నెలలను అమావాస్య నుంచి గణిస్తారు కనుక జేష్ఠ మాసం వైశాఖ మాసం అమావాస్య తర్వాత తిధి నుంచి ప్రారంభం అవుతుంది. అంటే ఈ ఏడాది జ్యేష్ట మాసం 2025 బుధవారం, మే 28న ప్రారంభమవుతుంది. జూన్ 25, 2025 వరకు ఉంటుంది. అయితే జ్యేష్ఠ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ నెల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..

Jyeshta Masam: జ్యేష్ట మాసంలో ఈ పనులు చేస్తే జాతక దోషం.. ఈ ఆహారం తింటే వ్యాధుల బారిన పడతారట..
Jyeshta Masam
Surya Kala
|

Updated on: May 20, 2025 | 12:19 PM

Share

జ్యేష్ఠ మాసము తెలుగు సంవత్సరంలో మూడవ నెల. పౌర్ణమి రోజున చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు కనుక ఈ నెల జ్యేష్ఠం అని అంటారు. హిందూ మతంలో ఈ నెల చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో చేసే ఉపవాసం, ఆధ్యాత్మిక కార్యకలాపాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నెలకు జ్యేష్ఠ అనే పేరు ఎలా వచ్చింది? ఈ నెలలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసుకుందాం..

జ్యేష్ఠ మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసం సంవత్సరంలో మూడవ నెల. ఈ నెలకు జ్యేష్ఠ అనే పేరు ఎందుకు వచ్చిందంటే.. జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం ఈ నెలలోని రోజులు ఇతర నెలల కంటే పగలు ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఎక్కువ పొడవున్న దానిని సంస్కృతంలో జ్యేష్ఠ అని పిలుస్తారు. అందుకే ఈ నెలకు జ్యేష్ఠ మాసం అని పేరు పెట్టారు. ఈ మాసానికి అధిపతి కుజుడు. ఈ నెలలో జ్యేష్ఠ నక్షత్రం, పౌర్ణమి తిథి కలయిక ఉంటుంది, అందుకే దీనిని జ్యేష్ఠ మాసం అని పిలుస్తారు.

జ్యేష్ఠ మాసంలో ఏమి చేయాలి?

  1. శాస్త్రాల ప్రకారం ఈ నెలలో స్నానం, దానధర్మాలు , పూజలు చేయడం శుభప్రదం. దీనితో పాటు ఈ నెలలో కొన్ని నియమాలను పాటించాలని చెప్పారు.
  2. ఈ నెలలో రోజులో ఒకసారి మాత్రమే తినాలి. దీని గురించి మహాభారతంలోని అనుశాసన పర్వంలో ప్రస్తావించబడింది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఈ నెలలో పగటిపూట నిద్రపోవడం నిషిద్ధం. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే.. కాసేపు నిద్రపోవచ్చు.
  5. సూర్యోదయానికి ముందే స్నానం చేసి.. సూర్య భగవానుడిని పూజించి నీటితో అర్ఘ్యం సమర్పించండి.
  6. జ్యేష్ఠ మాసంలో నీటిని దానం చేయడం చాలా ముఖ్యమైనది.
  7. ఈ మాసంలో నువ్వులను దానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు.
  8. ఈ నెలలో మొక్కలు, జంతువులు , పక్షులకు సేవ చేయడం ఒక సంప్రదాయం.
  9. జ్యేష్ఠ మాసంలో కుండ, నీటి దానం చేయడం వల్ల ఫలం లభిస్తుంది.
  10. జ్యేష్ఠ మాసానికి అధిపతి కుజుడు. కనుక ఈ మాసంలో హనుమంతుడిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

జ్యేష్ఠ మాసంలో ఏమి చేయకూడదంటే

  1. జ్యేష్ఠ మాసంతో ముడిపడి ఉన్న అనేక సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని విషయాలను పొరపాటున కూడా చేయవద్దంటూ నిషేధించబడ్డాయి.
  2. ఈ నెలలో నీటిని వృధా చేయడం వల్ల వరుణ దోషం వస్తుంది.
  3. ఈ నెలలో వంకాయ తినడం నిషేధించబడింది. ఇది పిల్లలకు హాని కలిగిస్తుందని చెబుతారు.
  4. వెల్లుల్లి, ఆవాలు తినకూడదు.
  5. జ్యేష్ఠ మాసంలో కారంగా ఉండే ఆహారాన్ని తినకూడదు.
  6. ఆయుర్వేదం ప్రకారం ఈ నెలలో శరీరంలో వాత వ్యాధి , వేడి పెరుగుతుంది. కనుక వాతావరణానికి అనుగుణంగా శరీరం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినే వాటిల్లో చేర్చుకోవాలి.
  7. జ్యేష్ఠ మాసంలో జుట్టు, గోర్లు కత్తిరించడం నిషిద్ధం. మాంసాహారం, మద్యం తీసుకోకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..