Hanuman Bhat Temple: ఐదు మంగళవారాలు, శనివారాలు పూజిస్తే కోరిన కోర్కెలు తీర్చే హనుమంతుడు.. ఎక్కడంటే..
భారతదేశంలో ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉన్న అనేక అద్భుత దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో ఒకటి పన్నాలోని హనుమాన్ భట ఆలయం. ఇక్కడ హనుమంతుడిని దర్శించుకుని తమ కోర్కెలు తీర్చమంటూ కొరుకొవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి, తెలుసుకుందాం...

మధ్యప్రదేశ్ బుందేల్‌ఖండ్‌లో పన్నాలోని పురాతన సిద్ధ స్థలం శ్రీ హనుమాన్ భట. ఇక్కడ చందేల్ కాలం నాటి హనుమంతుడి రాతి విగ్రహం ఉంది. దీనితో పాటు నరసింహ స్వామి, మహాకాళుడు కూడా ఇక్కడ ఉన్నారు. మంగళ, శనివారాల్లో భారీ సంఖ్యలో భక్తులు ఈ ప్రదేశానికి వస్తారు. ఈ ఆలయంలో పూజలను అందుకుంటున్న హనుమంతుడికి సంబంధించిన ఒక నమ్మకం ఉంది. ఇక్కడ నిర్మలమైన హృదయంతో హనుమంతుడిని దర్శించుకుంటే ఖర్చితంగా కోరిన కోర్కెలు నెరవేరాతాయట.
హనుమాన్ భట ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న ప్రదేశం. ఇక్కడికి చేరుకున్న వెంటనే మానసిక శాంతి, ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ ఆలయానికి 5 మంగళవారాలు వెళ్ళడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని, దుఃఖాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.
పన్నా జిల్లాలోని పావే తహసీల్‌లోని మోహంద్ర రోడ్డుకి సమీపంలో అత్యంత ఎత్తైన కొండలపై హనుమంతుడి ఆలయం ఉంది. భక్తులు ఈ ఆలయాన్ని శ్రీ హనుమాన్ భట ధామ్ పేరుతో పిలుస్తారు. ఈ సిద్ధ స్థలం దాని అతీంద్రియ, సహజ అద్భుత శక్తులతో మధ్యప్రదేశ్ అంతటా ప్రసిద్ధి చెందింది. హనుమంతుడి వద్దకు దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. తమ కోరికలను ఆ స్వామికి విన్నవించుకుంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం.. స్వామిని కోరుకున్న కోర్కె తీరకుండా ఖాళీ చేతులతో ఎవరూ తిరిగి వెళ్లలేదట
చందేల్ కాలం నాటి శిల్పాలు:
ఇక్కడ కలియుగ దైవం హనుమంతుడితో పాటు మహాకాలేశ్వరుడు, నరసింహ స్వామీ చందేల్ కాలం రాతి విగ్రహాలు ఉన్నాయి. దీనితో పాటు రాధా రాణి, శ్రీ రామ్ జానకి ఆలయం, ధూలియా మఠం, సిద్ధ మహారాజ్ సమాధి, మాతా కాలేహి పురాతన ఆలయం, పురాతన శంకర ఆలయం ఉన్నాయి.
ఆలయం ప్రకృతికి దగ్గరగా ఆలయాలు
ఇక్కడ ఉన్న సహజ ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఏడాది పొడవునా ఇక్కడ భక్తుల ప్రవాహం కొనసాగుతుంది. అయినా సరే ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇక్కడ ఒక భారీ ఉత్సవం జరుగుతుంది ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు హనుమంతుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. వరుసగా 5 మంగళవారాలు బజరంగ్ బలి పాదాలను ఎవరు పూజిస్తారో.. వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం.
పదకొండు వందల మెట్లు
ఇక్కడి ప్రజల విశ్వాసం ఏమిటంటే పదకొండు వందల మెట్లు ఎక్కి ఐదు మంగళవారాలు లేదా ఐదు శనివారాల్లో ఈ ప్రదేశంలో పూజలు చేస్తే వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ విశ్వాసం, నమ్మకం కారణంగా, భక్తులు పదకొండు వందల మెట్లు ఎక్కి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








