AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Facts: ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డ్.. ఒక్కసారి కూడా సున్నాకి అవుట్ కాని బ్యాటర్ ఎవరో తెలుసా?

IPL Facts: ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా డక్ అవుట్ కాకుండా 1700 పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా సాయి సుదర్శన్ రికార్డ్ సృష్టించాడు. రింకూ సింగ్ కూడా 1000 పరుగుల మార్కుతో ఈ జాబితాలో ఉన్నాడు. ఏ బౌలర్ కూడా వీళ్లను డక్ అవుట్ చేయలేకపోవడం వారి టెక్నిక్ ఎంత పటిష్టంగా ఉందో చెబుతోంది.

IPL Facts: ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డ్.. ఒక్కసారి కూడా సున్నాకి అవుట్ కాని బ్యాటర్ ఎవరో తెలుసా?
Sai Sudharsan
Rakesh
|

Updated on: Mar 19, 2026 | 12:58 PM

Share

IPL Facts: ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలైన వినోదాన్ని పంచే ఈ మెగా టోర్నీలో ఎన్నో రికార్డులు ఎప్పటికప్పుడు బ్రేక్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా బ్యాటర్ల విషయానికి వస్తే, ఒక సీజన్ మొత్తం అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి అత్యధిక పరుగులు చేసిన వారికి ఆరెంజ్ క్యాప్ దక్కుతుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాటర్ అత్యధిక పరుగులు చేయడమే కాదు.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా డక్ అవుట్ కాకుండా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ రికార్డుల రారాజు ఎవరో తెలుసుకుందాం.

గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం, 24 ఏళ్ల సాయి సుదర్శన్ ఐపీఎల్‌లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేశాడు. 2022లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తను ఆడిన 40 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా సున్నా పరుగులకు అవుట్ కాలేదు. ఇది ఐపీఎల్ వంటి హై-ప్రెజర్ టోర్నమెంట్‌లో చాలా అరుదైన విషయం. ఏకంగా 49.81 సగటుతో 1793 పరుగులు చేసిన సాయి సుదర్శన్, తన నిలకడైన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతని ఖాతాలో ఇప్పటికే 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏ బౌలర్ కూడా అతన్ని డక్ అవుట్ చేయలేకపోవడం అతని టెక్నిక్ ఎంత పటిష్టంగా ఉందో చెబుతోంది.

గత సీజన్ (IPL 2025) సాయి సుదర్శన్‌కు కెరీర్ బెస్ట్ అని చెప్పాలి. ఆ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన అతను ఏకంగా 759 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడి ఆరెంజ్ క్యాప్‌ దక్కించుకున్నాడు. 156.17 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ గుజరాత్ టైటాన్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. ఓపెనర్‌గా లేదా వన్ డౌన్‌లో వచ్చి పరుగుల వరద పారించడంలో సాయి సుదర్శన్ దిట్ట. ఇప్పుడు మార్చి 28 నుంచి మొదలయ్యే 19వ సీజన్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సాయి సుదర్శన్ తర్వాత ఈ అరుదైన రికార్డు ఉన్న మరో ఆటగాడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫినిషర్ రింకూ సింగ్. ఐపీఎల్ చరిత్రలో 1000కి పైగా పరుగులు చేసి, ఇప్పటివరకు ఒక్కసారి కూడా డక్ అవుట్ కాని రెండో బ్యాటర్ రింకూ సింగ్ మాత్రమే. 59 మ్యాచ్‌లు ఆడిన రింకూ, 1099 పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్‌లో వచ్చి టీమ్‌ను గెలిపించే రింకూ, సున్నాకి అవుట్ కాకుండా ఉండటం అతని ఏకాగ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ స్టార్లలో సాయి సుదర్శన్, రింకూ సింగ్ మాత్రమే ఈ నో డక్ క్లబ్‌లో సభ్యులుగా ఉన్నారు.

ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడనుంది. ఈ సీజన్‌లో సాయి సుదర్శన్ తన నో డక్ రికార్డును అలాగే కొనసాగిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అటు రింకూ సింగ్ కూడా కేకేఆర్ తరఫున ఫినిషర్‌గా తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. మరి ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us