AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : కోహ్లీ, వైభవ్‌లకు కాదు.. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, టోర్నమెంట్ఇ వ్వాల్సింది.. నిజంగానే అన్యాయం జరిగిందా?

IPL 2026 : ఫైనల్ మ్యాచ్‌లో కూడా భువనేశ్వర్ కుమార్ తన 4 ఓవర్లలో కేవలం 29 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌తో పాటు చివర్లో జేసన్ హోల్డర్‌ను అవుట్ చేసి గుజరాత్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.

IPL 2026 : కోహ్లీ, వైభవ్‌లకు కాదు.. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, టోర్నమెంట్ఇ వ్వాల్సింది.. నిజంగానే అన్యాయం జరిగిందా?
Ipl 2026
Rakesh
|

Updated on: Jun 01, 2026 | 7:40 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ఆర్సీబీ గ్రాండ్ విక్టరీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, సీజన్ అంతా రన్స్ వరద పారించిన వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది. అయితే టీమిండియా మాజీ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఈ అవార్డులపై ఒక షాకింగ్ కామెంట్ చేశాడు. కోహ్లీ లేదా వైభవ్‌లకు కాకుండా.. ఈ రెండు అవార్డులు మరో స్టార్ ప్లేయర్‌కు దక్కాల్సిందంటూ అశ్విన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ.. గుజరాత్ టైటాన్స్‌ను కేవలం 155 పరుగులకే కట్టడి చేసింది. ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో విరాట్ కోహ్లీ అల్టిమేట్ ఇన్నింగ్స్ ఆడాడు. కాల్లో తీవ్రమైన నెప్పి ఉన్నప్పటికీ, ఫిజియోలు రెండు సార్లు వచ్చి చెక్ చేసినా కోహ్లీ మైదానం వీడలేదు. ఆ నొప్పితోనే కేవలం 25 బంతుల్లోనే ఐపీఎల్ చరిత్రలో తన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు. ఓవరాల్‌గా 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఆర్‌సీబీని గెలిపించాడు. అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ గెలుపుతో ముంబై, చెన్నై తర్వాత వరుసగా రెండుసార్లు ఐపీఎల్ కప్ కొట్టిన మూడో టీమ్‌గా ఆర్‌సీబీ రికార్డు సృష్టించింది.

ఇక రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ మొత్తంలో క్లాస్ బ్యాటింగ్‌తో గడగడలాడించాడు. 16 మ్యాచ్‌లలో 48.50 యావరేజ్, ఏకంగా 237.30 భారీ స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇవే అత్యధిక పరుగులు కావడంతో అతడిని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది.

అయితే రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు అవార్డులకు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మాత్రమే నూటికి నూరు శాతం అర్హుడు. ఫైనల్ ముగిసిన తర్వాత అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. “భువనేశ్వర్ కుమార్ ఈ టోర్నమెంట్ అంతటా అత్యంత అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. నా లెక్క ప్రకారం.. ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే ఈ సీజన్ మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు భువీకే ఇవ్వాల్సింది” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఫైనల్ మ్యాచ్‌లో కూడా భువనేశ్వర్ కుమార్ తన 4 ఓవర్లలో కేవలం 29 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌తో పాటు చివర్లో జేసన్ హోల్డర్‌ను అవుట్ చేసి గుజరాత్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఈ సీజన్ మొత్తంలో 16 మ్యాచులు ఆడిన భువీ ఏకంగా 28 వికెట్లు తీశాడు. ఎన్నో మ్యాచుల్లో ఆర్‌సీబీ కష్టాల్లో ఉన్నప్పుడు తన బౌలింగ్‌తో గట్టెక్కించాడు. కేవలం ఒక్క వికెట్ తేడాతో అతను పర్పుల్ క్యాప్ మిస్ అయ్యాడు (గుజరాత్ పేసర్ కగిసో రబడా 29 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు). ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే రెండు సార్లు పర్పుల్ క్యాప్ గెలిచిన రికార్డు భువీ సొంతం. టోర్నీ అంతా భువీ పడ్డ కష్టానికి తగిన గుర్తింపు రాలేదనేది అశ్విన్ ఫీలింగ్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us