AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Board Meeting : అర్థరాత్రి ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ దేశ క్రికెట్ బోర్డుపై తక్షణమే నిషేధం

ICC Board Meeting : ఐసీసీ తాజాగా ఒక ఊహించని నిర్ణయం తీసుకుని క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటివరకు పలు ప్రపంచకప్ టోర్నమెంట్లలో పాల్గొన్న కెనడా క్రికెట్ బోర్డు పై ఐసీసీ తక్షణమే అమలులోకి వచ్చేలా సస్పెన్షన్ వేటు వేసింది.

ICC Board Meeting : అర్థరాత్రి ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ దేశ క్రికెట్ బోర్డుపై తక్షణమే నిషేధం
Icc
Rakesh
|

Updated on: Jun 01, 2026 | 7:18 PM

Share

ICC Board Meeting : ఐసీసీ తాజాగా ఒక ఊహించని నిర్ణయం తీసుకుని క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటివరకు పలు ప్రపంచకప్ టోర్నమెంట్లలో పాల్గొన్న కెనడా క్రికెట్ బోర్డు పై ఐసీసీ తక్షణమే అమలులోకి వచ్చేలా సస్పెన్షన్ వేటు వేసింది. ఐసీసీ సభ్యత్వ నిబంధనలను, బాధ్యతలను కెనడా క్రికెట్ బోర్డు తీవ్రంగా ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మే 31న అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ కీలక తీర్పు వెలువడింది.

కెనడా క్రికెట్ బోర్డును సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే ఈ నిషేధం కేవలం అడ్మినిస్ట్రేషన్ కు మాత్రమే పరిమితం కానుంది. దీనివల్ల కెనడా దేశానికి చెందిన క్రికెట్ ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగదు. వారు ఎప్పటిలాగే ఐసీసీ నిర్వహించే అన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లలో సాధారణంగానే పాల్గొనవచ్చని ఐసీసీ భరోసా ఇచ్చింది. ఆటగాళ్ల భవిష్యత్తు, వారి ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటం కోసం ఐసీసీ ఒక ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ద్వారా నిధులను నేరుగా అందజేయనుంది.

కెనడా క్రికెట్ బోర్డుపై విధించిన ఈ నిషేధాన్ని ఎత్తివేయడానికి ఐసీసీ కొన్ని కఠినమైన షరతులను విధించింది. బోర్డులోని పరిపాలనా లోపాలను, ఆర్థిక అవకతవకలను పూర్తిగా సరిదిద్దడమే ఈ షరతుల ముఖ్య ఉద్దేశం. కెనడా బోర్డు ఈ దిశగా పనులు చేస్తోందా లేదా అని నిరంతరం గమనించడానికి, పర్యవేక్షించడానికి ఐసీసీ ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతోంది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో కెనడా బోర్డు పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటారు.

అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఐసీసీ మీటింగ్‌లో కెనడా నిషేధంతో పాటు మరికొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లలో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఆటను ముందే ముగించేస్తుంటారు, ఇది ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ కలిగిస్తుంది. దీనిని నివారించడం కోసం.. మ్యాచ్ సమయంలో వెలుతురు తగ్గినప్పుడు ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరిస్తే గనుక, ఎరుపు రంగు బంతికి బదులుగా పింక్ బాల్ ఉపయోగించవచ్చనే సరికొత్త ప్రతిపాదనకు ఐసీసీ ఆమోదం తెలిపింది. దీనివల్ల రాబోయే రోజుల్లో సాధారణ టెస్ట్ మ్యాచ్‌లలో కూడా పింక్ బాల్ మ్యాజిక్ కనిపించనుంది.

ఈ కీలక సమావేశంలో పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన క్వాలిఫైయింగ్ ప్రక్రియపై కూడా చర్చలు జరిగాయి. రాబోయే ప్రపంచకప్ టోర్నీల కోసం ఒక భారీ గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌ను నిర్వహించే విషయంపై ఐసీసీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. దీనివల్ల అసోసియేట్ దేశాలకు ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు మరింత సమానమైన అవకాశాలు లభిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ లీగ్ క్రికెట్ (ఐపీఎల్, పీఎస్ఎల్, బిగ్ బాష్ వంటి ఫ్రాంచైజీ టోర్నీలు) విపరీతంగా పెరిగిపోతుండటంపై ఐసీసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌కు, ఈ ప్రైవేట్ ఫ్రాంచైజీ లీగ్‌ల షెడ్యూల్‌కు మధ్య సరైన సమతుల్యతను కాపాడటం ఎలా అనే అంశంపై ఐసీసీ దృష్టి సారించింది. లీగ్ క్రికెట్ వల్ల అంతర్జాతీయ మ్యాచులు దెబ్బతినకుండా ఉండేందుకు, దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి ఐసీసీ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us