AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Purana: వివాహేతర సంబంధం కలిగి ఉండే స్త్రీ, పురుషులకు ఏ శిక్ష లభిస్తుంది.. ఎటువంటి జన్మ ఎత్తాల్సి ఉంటుందో తెలుసా…

గరుడ పురాణానికి అధినేత శ్రీ మహా విష్ణువు. ఇందులో మనిషి జీవితం, మరణం, పునర్జన్మకు సంబంధించిన విశేషాలతో పాటు ఆత్మల గురించి సహా మరెన్నో విషయాలను తెలియజేస్తుంది. దీనితో పాటు గరుడ పురాణంలో విష్ణువు మనిషి సరైన మార్గంలో నడిచే విధానాన్ని, మనుషులకు ఉండకూడని చెడు అలవాట్ల గురించి వివరించాడు. స్త్రే, లేదా పురుషులు చేసే కొన్ని రకాల పనుల వలన మరణాంతరం ఆత్మకు పడే శిక్ష మాత్రమే కాదు మరు జన్మలో ఎటువంటి ఎత్తాల్సి ఉంటుందో కూడా తెలిపారు.

Garuda Purana:  వివాహేతర సంబంధం కలిగి ఉండే స్త్రీ, పురుషులకు ఏ శిక్ష లభిస్తుంది.. ఎటువంటి జన్మ ఎత్తాల్సి ఉంటుందో తెలుసా...
Garuda Puranam
Surya Kala
|

Updated on: May 20, 2025 | 10:04 AM

Share

హిందూ మతంలోని మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణం జననం, మరణం, మరణానంతర ప్రపంచం గురించి వివరిస్తుంది. విష్ణువు, పక్షి రాజు గరుడకి మధ్య జరిగిన సంభాషణ గరుడ పురాణంలో వివరించబడింది. గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన కర్మలను బట్టి స్వర్గం, నరకం లేదా మోక్షాన్ని పొందుతాడని స్పష్టంగా చెప్పబడింది. మనిషి తన మంచి, చెడు కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. గరుడ పురాణంలో కూడా ఒక వ్యక్తి పాత్ర గురించి సమాచారం ఇవ్వబడింది. జీవితాంతం నీచమైన పనులు చేస్తూ గడిపే స్త్రీ పురుషులు నరక యాతనలను అనుభవించవలసి ఉంటుంది. వారి తదుపరి జన్మలో వింతైన, విషపూరిత జీవుల గర్భం నుంచి కొత్త జీవితాన్ని పొందాల్సి ఉంటుంది.

గరుడ పురాణం ప్రకారం.. స్త్రీని లైంగికంగా దోపిడీ చేసే పురుషుడు మరణాంతరం ఆత్మ నరకానికి చేరుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో.. అటువంటి దుష్ట ఆత్మ తదుపరి జన్మ పొందినప్పుడు.. కొండచిలువ నుంచి జన్మించాల్సి వస్తుంది.

తమ గురువు భార్యతో శారీరక సంబంధం కలిగి ఉన్న పురుషులు అంటే తమ గురు మాతపై చెడు దృష్టి కలిగి ఉన్నవారు లేదా ఆమెతో శారీరక సంబంధం కలిగి ఉన్నవారు.. మరణం తరువాత.. తదుపరి జన్మలో తొండగా పుడతారు.

ఇవి కూడా చదవండి

గరుడ పురాణం ప్రకారం తమ స్నేహితుడి భార్యపై చెడు దృష్టి కలిగి ఉన్నా.. స్నేహితుడి భార్యతో శారీరక సంబంధం పెట్టుకునే పురుషులు నరకంలో అతిదారుణమైన హింసను అనుభవించడమే కాదు వారి తదుపరి జన్మలో గాడిదగా పుడతారు.

గరుడ పురాణం ప్రకారం స్త్రీలను గౌరవించని పురుషులు, స్త్రీలను కొట్టి హింసించే పురుషులు, స్త్రీలను వేధించే పురుషులు మరణానంతరం నరకం అనుభవించాల్సి ఉంటుంది. తదుపరి జన్మలో అటువంటి పురుషుల ఆత్మ నపుంసకుడిగా పుడుతుంది.

అదే విధంగా వివాహిత స్త్రీలు పరాయి పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకుంటే అటువంటి స్త్రీ ఆత్మకు నరకంలో చోటు లభిస్తుంది. అక్కడ రకరకాల హింస అనుభవించిన తర్వాత,.. స్త్రీ తదుపరి జన్మ పొందినప్పుడు బల్లి, పాము లేదా గబ్బిలం గా జన్మలభిస్తుంది.

అటువంటి పరిస్థితిలో.. నరక హింసల నుంచి తప్పించుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి లేదా మానవ రూపంలోకి తిరిగి జన్మించేందుకు ఆ జీవిగా జన్మించి జీవితాంతం మంచి పనులు చేయాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
నరాలకు, కండరాలకు అద్భుతమైన ఫుడ్.. రోజుకు ఒక్కటి తినండి చాలు..
నరాలకు, కండరాలకు అద్భుతమైన ఫుడ్.. రోజుకు ఒక్కటి తినండి చాలు..
అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు
అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు
మనందరం వెళ్లిపోవాల్సిందే.. రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. నానా..
మనందరం వెళ్లిపోవాల్సిందే.. రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. నానా..
పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కోచింగ్ స్టాఫ్ మొత్తం ఔట్
పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కోచింగ్ స్టాఫ్ మొత్తం ఔట్
ఇప్పుడే వద్దు.. UPI పేమెంట్స్‌పై ఛార్జీలు అప్పటివరకు వాయిదా..!
ఇప్పుడే వద్దు.. UPI పేమెంట్స్‌పై ఛార్జీలు అప్పటివరకు వాయిదా..!
ఏపీలో వాట్సాప్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం
ఏపీలో వాట్సాప్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి