- Telugu News Photo Gallery Spiritual photos Ravana Temples in India: Did You Know These Places In India Where Ravana Is Worshipped
Ravana Temples in India: మనదేశంలో రావణుడిని దేవుడిగా భావించి పూజిస్తారని తెలుసా.. ఏపీ సహా ఎక్కడ రావణుడికి ఆలయాలున్నాయంటే..
రామాయణంలో లంకాధీశుడు రావణుడు పర స్త్రీ అయిన సీతాదేవిని మోహించి అపహరించి పాపం చేసిన వ్యక్తీ. అయితే రావణుడు పౌలస్త్య బ్రహ్మ వారసుడు. నవ వ్యాకరణ పండితుడు. గొప్ప రాజనీతి కలిగి.. రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నవాడు. గొప్ప శివ భక్తుడైన రావణ బ్రహ్మ కొన్ని ప్రాంతాల్లో హీరోగా భావిస్తారు. శ్రీ లంకలో మాత్రమే కాదు మన దేశంలో కూడా అనే ప్రాంతాల్లో రావణుడిని దేవుడిగా భావించి పుజిస్తారు. రావణుడి ఆంధ్రప్రదేశ్ తో పాటు మన దేశంలో అనేక ప్రాంతాల్లో దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయాలు ఎక్కడో ఈ రోజు తెలుసుకుందాం...
Updated on: May 20, 2025 | 10:58 AM

రావణాసురుడు తల్లి దండ్రులు బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వ వసు బ్రహ్మ.. దైత్య రాకుమారియైన కైకసి. ఈ దంపతులకు రావణాసురుడు, విబీషణుడు, కుంభకర్ణుడు కుమారులు, చంద్రనఖు అనేకుమార్తే సంతానం. రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు. చిన్నతనం నుంచి ఏకసంథాగ్రాహి. శివుడికి పరమ భక్తుడు. రామాయణంలో ఒక విలన్ రావణ బ్రహ్మను మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హీరోగా భావించి ప్రతిరోజూ పూజిస్తారు. రావణుడి ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..

కాకినాడలో రావణ ఆలయంల: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రావణుడికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి ఉంది. ఈ నగరంలో శివునికి అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించడానికి రావణుడు స్వయంగా ఈ స్థలాన్ని ఎంచుకున్నాడని నమ్ముతారు. ఈ ఆలయంలో శివలింగం భారీ విగ్రహం ఉంది. ఇది రావణునికి శివుడి పట్ల ఉన్న భక్తిని సూచిస్తుంది. బీచ్ కి దగ్గరగా ఉన్న ఈ ఆలయం ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ప్రదేశం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రావణుడిని పూజించే ఏకైక ప్రదేశం కాకినాడ.

మందసౌర్, మధ్యప్రదేశ్: హిందూ పురాణ గ్రంధాల ప్రకారం రావణుని భార్య మండోదేవి మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో జన్మించింది. అందువల్ల ఇక్కడి ప్రజలు రావణుడిని మందసౌర్ అల్లుడిగా పూజిస్తారు. దసరా పండుగ సమయంలో స్థానిక ప్రజలు రావణుడి ఆలయంలో దీపాలు వెలిగించి పూజిస్తారు.

రావణగ్రామ్, విదిషలోని రావణ ఆలయం: రావణగ్రామ్ అనేది రావణుడి పేరు మీద ఉన్న గ్రామం. ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయం లంకా రాజుకు అంకితం చేయబడింద. రావణుడి భార్య మండోదరి విదిశ నుంచి వచ్చి ఇక్కడ కళ్యాణం జరిగినట్లు నమ్మకం.ఈ ప్రదేశంలో రావణ భక్తులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు. ఈ ఆలయంలో 10 అడుగుల ఎత్తైన రావణుడి విగ్రహం ఉంది. ఒకప్పుడు ఇతర ప్రదేశాల మాదిరిగానే ఇక్కడ వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిగేవి. ఎందుకంటే రావణుడు మండోదరి వివాహం మందసౌర్‌లోని ఈ పాత ఆలయంలో జరిగింది. దసరా ఉత్సవాల సమయంలో ఇక్కడ రావణుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పుజిస్తారు.

దశానన ఆలయం, కాన్పూర్: కాన్పూర్‌లోని 100 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ దశానన ఆలయం సంవత్సరానికి ఒకసారి దసరా సమయంలో మాత్రమే తెరుచుకుంటుంది. ఇక్కడ భక్తులు రావణుడికి నివాళులు అర్పిస్తారు. ఈ ఆలయాన్ని 1890 లో రాజు గురు ప్రసాద్ శుక్ల్ నిర్మించినట్లు తెలుస్తోంది. స్థానికులు రావణుడిని గొప్ప పండితుడిగా, శివుని గొప్ప భక్తుడిగా భావిస్తారు. ఈ ఆలయంలో రావణుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు.

రావణ మందిరం, బిస్రాఖ్, ఉత్తరప్రదేశ్: హిందూ పురాణాల ప్రకారం రావణుడి జన్మస్థలం ఉత్తరప్రదేశ్‌లోని బిస్రాఖ్ ప్రాంతంలో ఉంది. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని మహా బ్రహ్మగా పూజిస్తారు. నవరాత్రి 10వ రోజున స్థానిక ప్రజలు రావణుడిని పూజించి యజ్ఞం చేస్తారు.

కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు ఈ ప్రదేశంలో భక్తితో తపస్సు చేశాడని చెబుతారు. రావణుడి తపస్సుకు శివుడు ముగ్ధుడై రావణ బ్రహ్మ ముందు ప్రత్యక్షం అయ్యి తన ఆశీస్సులు ఇచ్చాడని స్థానికుల నమ్మకం. అందువల్ల కాంగ్రా స్థానికులు రాబెనాసర్ లో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయరు. పైగా పూజలను చేస్తారు.

జోధ్‌పూర్, రాజస్థాన్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఈ ఆలయంలో రావణుడిని రావణ దేవుడిగా రోజూ పూజిస్తారు. పురాణాల ప్రకారం రావణుడు మండవర రాజు కుమార్తె మండోదరిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇక్కడ సరస్వతి నది ప్రవహిస్తోంది. మండవర రాజు రాజ్యం సరస్వతి నది ఒడ్డున ఉండేది. నేటికీ మండవర రాజు వారసులు జోధ్‌పూర్‌లోని అనేక ప్రదేశాలలో తమ అల్లుడు రావణుడైన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తారు. నవరాత్రి తర్వాత రోజు ఈ ప్రాంతంలో రావణుని ఆత్మ శాంతి కోసం దీపం వెలిగిస్తారు.

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో రామలింగేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ రావణుడిని రామప్ప లేదా రామలింగంగా పూజిస్తారు. అవనిలో ఉన్న ఈ ఆలయంలో రావణుడు కైలాస పర్వతం నుంచి తీసుకువచ్చినట్లు భావిస్తున్న నాలుగు శివలింగాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో మార్కండేశ్వర స్వామి రథోత్సవం తర్వాత రావణ ఉత్సవాన్ని కూడా జరుపుతారు. ఇది 15వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం. ఇంకా కోలార్ లోపల సుగతూర్ అనే గ్రామం ఉంది అక్కడ రావణ మహోత్సవం సందర్భంగా రావణుడు శివుడిని మోసుకెళ్తున్నట్లు చిత్రీకరించే ఊరేగింపు జరుగుతుంది




