చికెన్, మటన్ కూరను తలదన్నే పచ్చి మామిడి రొయ్యల కూర
Prasanna Yadla
19 March 2026
Pic credit - Pixabay
పచ్చి రొయ్యలతో మామిడి కాయను వండుకుంటే రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ కూరల్లోఇదే బెస్ట్.
నాన్ వెజ్ కూరల్లోఇదే బెస్ట్
ఈ కూర ముందు చికెన్, మటన్ కూరలు కూడా సరిపోవు. మసాలాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.
చికెన్, మటన్ కూరలు కూడా సరిపోవు
ఇంకెందుకు లేట్ ఈ కూరను ఎలా చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
పచ్చి రొయ్యలు మామిడి కూర
అర కిలో పచ్చి రొయ్యలు, ఒక పెద్ద పచ్చి మామిడికాయ లేదా ఒక కప్పు ముక్కలు, అర కప్పు నూనెను తీసుకోవాలి. 4 టమోటాలు, రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి తీసుకోవాలి
ముందుగా పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు తీసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు బాగా వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించాలి.
స్టెప్ -1
ఆ తర్వాత మాసాలు, టమోటా ముక్కలు బాగా ఉడికించి ముందుగా క్లీన్ చేసిన రొయ్యలను వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. మామిడి ముక్కలు కూడా వేసి 10 నిముషాలు ఉంచి దించుకోవడమే.