- Telugu News Photo Gallery Spiritual photos Chandra Mangala Yoga 2025: Wealth Boost for These Lucky Zodiac Signs. Details in Telugu
Lucky Zodiac Signs: అదృష్టమంటే ఈ రాశుల వారిదే.. సంపద వృద్ధి కావడం పక్కా..!
Chandra Mangal Yoga: ఈ నెల(మే) 24, 25, 26 తేదీల్లో కుజ, చంద్రుల మధ్య రాశి పరివర్తన జరుగుతోంది. కుజ, చంద్రులు కలిసినా, పరస్పరం వీక్షించుకున్నా, ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరిగినా ఆదాయం, ఆరోగ్యం, అధికారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రెండింటి మధ్యా కనెక్షన్ ఏర్పడడాన్ని చంద్ర మంగళ యోగంగా అభివర్ణిస్తారు. నూటికి నూరు పాళ్లు ఫలించే యోగం ఇది. ఈ మూడు రోజుల్లో ఆదాయం, అధికారం, ఆరోగ్యానికి సంబంధించి చేపట్టే ఏ ప్రయత్నమైనా అత్యధికంగా శుభ ఫలితాలనిస్తుంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి ఈ చంద్ర మంగళ యోగం వల్ల సంపద బాగా వృద్ధి చెందుతుంది.
Updated on: May 19, 2025 | 7:03 PM

మేషం: రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానాధిపతి చంద్రుడితో పరివర్తన చెందడం వల్ల ఆస్తి లాభం, భూ లాభం వంటివి తప్పకుండా కలుగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. అతి తక్కువ ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మాతృమూలక ధన లాభం కలుగుతుంది.

మిథునం: ఈ రాశికి ధన, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. భూ లాభం కలుగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు.

కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడికి, దశమాధిపతి కుజుడికి మధ్య పరివర్తన జరిగినందువల్ల ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. అధికారులు మీ వల్ల బాగా లబ్ధి పొందుతారు. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అత్యధికంగా లాభాలు పొందుతారు. ఆస్తి లాభం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలుస్తాయి.

తుల: ఈ రాశికి సప్తమ, దశమాధిపతులైన కుజ, చంద్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల కుబేర యోగం, లక్ష్మీయోగం పట్టడం జరుగుతుంది. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.

మకరం: ఈ రాశికి చతుర్థ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన చోటు చేసుకున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. వారసత్వపు ఆస్తి లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉన్నత వర్గాలతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో దశ తిరుగుతుంది.

మీనం: ఈ రాశికి ధన, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల పట్టిందల్లా బంగారం అవు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు కనక వర్షం కురిపిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. పిల్లలు బాగా పురోగతి చెందుతారు. సంతాన యోగానికి అవకాశం ఉంది.



