Viral Video: సినిమాటిక్ స్టైల్లో వివాహ విందును అడ్డుకున్న మహిళ… వివాహ విందులో రచ్చ రంబోలా
పెళ్లి పీటలపై వివాహం ఆగిపోవడం.. సరిగ్గా తాళి కట్టే సమయానికి ఆపండి అనే గొంతు ఎక్కడి నుంచో వినపడడం వంటి సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. అచ్చం సినిమాటిక్ స్టైల్లోనే భువనేశ్వర్‌లో ఓ పెళ్లిలో జరిగింది. పెళ్లి అయ్యాక జోరుగా రిసెప్షన్ జరుపుకుంటున్న ఓ వేడుకలోకి పోలీసులతో ఓ మహిళా...

పెళ్లి పీటలపై వివాహం ఆగిపోవడం.. సరిగ్గా తాళి కట్టే సమయానికి ఆపండి అనే గొంతు ఎక్కడి నుంచో వినపడడం వంటి సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. అచ్చం సినిమాటిక్ స్టైల్లోనే భువనేశ్వర్‌లో ఓ పెళ్లిలో జరిగింది. పెళ్లి అయ్యాక జోరుగా రిసెప్షన్ జరుపుకుంటున్న ఓ వేడుకలోకి పోలీసులతో ఓ మహిళా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు.. అక్కడున్న వరుడిపై దాడికి దిగింది. ఈ గందరగోళంలో రిసెప్షన్ అర్ధాంతరంగా ఆగిపోయింది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వరుడు మోసం చేశాడని ఆ మహిళ ఆరోపిస్తూ రిసెప్షన్‌ను అడ్డుకుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం రాత్రి ధౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్యాణ మండపంలో పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరుపుతున్నారు. ఇంతలో ఒక మహిళ పోలీసులతో కలిసి రిసెప్షన్‌లోకి అడుగుపెట్టింది. రావడం రావడంతోనే వరుడిపై దాడి చేసి కొట్టింది. అక్కడున్న వారు తేరుకుని వారిని విడిపించారు.
వరుడితో ఇప్పటికే తనకు నిశ్చితార్థం జరిగిందని ఆ మహిళ చెప్పింది. అతడు తనను మోసం చేసి మరో పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపించింది. తన దగ్గర నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడని కూడా చెప్పింది. దీంతో పోలీసులు ఆ వరుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. చివిరిక పోలీసుల సమక్షంలో వారిద్దరి మధ్య రాజీ కుదిరినట్లు తెలిసింది.
వీడియో చూడండి:
Woman disrupts wedding reception in Bhubaneswar, accuses groom of betrayal#odisha #Bhubaneswar pic.twitter.com/93FSXrf1Ch
— Karthick Chandrasekar (@kart997) May 13, 2025