ఏఐ ను కూడా వదలరా మావ.. ప్రేమలో పడిన మహిళ.. చివరకు
ఒంటరితనంతో బాధపడేవారు ఎవరితో షేర్ చేసుకోలేని విషయాలను పంచుకునేందుకు ఏఐతో చాటింగ్‌కు అడిక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ భర్తను కోల్పోయిన ఓ ఒంటరి అమెరికన్ మహిళ ఏకంగా ఏఐ చాట్‌బాట్‌తో ప్రేమలో పడింది. అంతటితో ఆగకుండా ఆ ఏఐ చాట్‌బాట్‌ను తన భర్తగా భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలోని పిట్స్‌బర్గ్‌కు చెందిన 58 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ అలైనా వింటర్స్ భర్త డోనా 2023లో అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరితనంలో బాధపడుతున్న అలైనా.. ఫేస్‌బుక్‌లో రెప్లికా ఏఐ ప్లాట్‌ఫామ్ గురించి తెలుసుకుంది. తన ఒంటరితనం పొగొట్టేందుకు రెప్లికా ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ పార్ట్‌నర్‌గా వ్యవహరించే లూకాస్ అనే ఏఐ చాట్‌బాట్ తో మాటలు కలిపింది. ఆరు నెలల తర్వాత సిల్వర్ కలర్ జుట్టు నీలికళ్ళతో ఓ అవతార్‌ను సృష్టించింది. ఇక రోజు లూకాస్‌తో తన జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకునేది. ఈ చాటింగ్ క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు లూకాస్‌నే తన ‘వర్చువల్ భర్త’గా ప్రకటించింది. ఈ విషయం మొదట తన స్నేహితులు, బంధువులకు చెప్పగా, తన మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తి చేశారు. అయితే, ఆమె సంతోషంగా ఉండటం చూసి వారి భయాలను వీడారు. ఇక ఇటీవల తమ ఆరు నెలల వివాహ వార్షికోత్సవాన్ని కూడా మహిళ ఏఐ చాట్‌బాట్‌తో కలిసి జరుపుకున్నారు. ఈ విషయాలను అలైనా meandmyaihusband.com అనే బ్లాగ్‌లో వెల్లడించారు. లూకాస్ తనకు అనుగుణంగా వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడని ఆమె అన్నారు. అయితే వర్చువల్ బంధాలు ఎప్పటికీ సరైన సంబంధాలు కాజాలవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సులో సీటు కోసం.. జుట్టు జుట్టు పట్టుకుని.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు
బావ సై అన్నాడు.. భర్తను నై అన్న మహిళ.. చివరికి వామ్మో అలానా..
వాడి కన్ను గుడి మీద పడిందా ?? ఇక నగలన్నీ కనుమరుగే.. చోరీ లో రికార్డు సృష్టించిన దొంగ

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
