బస్సులో సీటు కోసం.. జుట్టు జుట్టు పట్టుకుని.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి రాష్ట్రంలో నిత్యం ఏదో ఓచోట బస్సుల్లో మహిళల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సీట్ల కోసం మహిళలు బస్సుల్లో కొట్టుకునే ఘటనలు రోజు ఎక్కడో ఓ చోట కనిపిస్తునే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు ఘర్షణ పడ్డారు.
అది కాస్త మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు దారితీసింది, వీరి తిట్ల పురాణం, కొట్టుకున్న తీరును చూసి మిగిలిన ప్రయాణికులు నవ్వుకున్నారు. ఇద్దరు మహిళలను తోటి ప్రయాణికులు ఎంత వారిచ్చిన ఉపయోగం లేకపోవడంతో డ్రైవర్ బస్సును అశ్వాపురం పోలీస్ స్టేషన్ వద్ద నిలిపివేశారు. సీటు కోసం మహిళల మధ్య జరిగిన గొడవ గురించి డ్రైవర్ పోలీసులకు తెలియజేయడంతో ఇద్దరు మహిళలను మందలించి ఆ మహిళలను వేరువేరు బస్సుల్లో పంపించారు పోలీసులు, బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు బాహాబాహికి దిగడం తోటి ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బావ సై అన్నాడు.. భర్తను నై అన్న మహిళ.. చివరికి వామ్మో అలానా..
వాడి కన్ను గుడి మీద పడిందా ?? ఇక నగలన్నీ కనుమరుగే.. చోరీ లో రికార్డు సృష్టించిన దొంగ
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..?
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

