వాడి కన్ను గుడి మీద పడిందా ?? ఇక నగలన్నీ కనుమరుగే.. చోరీ లో రికార్డు సృష్టించిన దొంగ
కొందరు గుడికి భక్తి తో వెళ్తారు. మరికొందరు భయంతో వెళతారు. కానీ ఎవరైనా సరే.. విశ్వాసంతోనే దేవుడిని దర్శించుకుని తమ కష్టాలను తీర్చమని దేవుళ్లను వేడుకుంటారు. కోరిన కోర్కెలు తీరితే అదే క్షేత్రాన్ని మరోసారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కాని వాడలంటోడు కాదు. కోరుకున్న ఆలయానికి వెళ్లి ఏం కొట్టాయాలా అని ఆలోచిస్తాడు.
ఆలయాల దొంగతనాల్లో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టాడు. అసలు వాడు గుడిలో సొత్తును ఎలా కొట్టేస్తాడో తెలుసా? కొందరు తమ రకరకాల టాలెంట్‌తో రికార్డులు సృష్టిస్తారు. చోర కళ కూడా ఒక టాలెంటే అనుకున్నాడేమో గానీ.. వీడు దొంగతనాల్లో రికార్డే సృష్టించాడు. అయితే వీడు చేసేది అలాంటి ఇలాంటి దొంగతనాలు కావు. ఏకంగా గుడిని, గుడిలోని లింగాన్ని మింగే తంతు అన్నమాట. అందరి మాదిరిగా వీడు గుడికి వెళతాడు కానీ, దేవుడిని మొక్కుకోవడానికైతే కాదు.. ఆలయానికి వెళ్లి అందరిలా భక్తితో కాకుండా డిఫరెంట్‌గా ఏం కొట్టాయాలా అని ఆలోచిస్తాడు. అవకాశం వీలు కుదిరితే అప్పటికప్పుడు పని కానిచ్చేస్తాడు. లేదంటే మరో ఎటెంప్ట్‌లో టార్గెట్ ఫినిష్ చేస్తాడు. రాం గోపాల్ వర్మ తీసిన గోవిందా గోవిందా సినిమాలో దొంగలు వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని అపహరించుకుపోతారు. అయితే అది కల్పన . వాస్తవానికి ఇలా గుళ్లలో విగ్రహాలు , హుండీలు దోచుకెళ్లారనే ఘటనలు మనం చాలానే వింటున్నాం. అయితే అలాంటి వారు పోలీసులకు పట్టుబడి జైళ్లకు సైతం వెళ్లారు. కాని బుద్ధి మారకపోతే మనిషి తలరాత మారదుకదా….మొత్తం 50 ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ దొంగ మరోసారి ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు చిక్కాడు. స్ధానిక సత్రంపాడులోని సౌభాగ్య లక్ష్మి ఆలయంలో ఇటీవల చోరీ జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడ కొత్తపేటకు చెందిన ఈమని రాంబాబు ను పోలీసులు అరెస్టు చేసి 30 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..?
పారిజాతం మొక్క లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
