నెలరోజులు నానబెట్టిన పల్లీలు తినండి..ఫలితం మీరే చూడండి!
నానబెట్టిన పల్లీలు తినడం వల్ల పుష్కలమైన ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. నానబెట్టిన వేరుశెనగలు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు కలిగి ఉంటాయి. నానబెట్టిన వేరుశెనగలు తింటే తక్షణ శక్తి అందిస్తుంది. వీటిలో పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు అధికంగా కలిగి ఉంటుంది. పరగడుపున నానబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల కండరాలను టోన్ చేయడానికి, కండరాల క్షీణతను నివారించడానికి సహాయపడతాయి. ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల పిల్లలు, పెద్దల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వీటిలో విటమిన్ E, C సంవృద్ధిగా ఉంటుంది. ఇవి జుట్టుతో పాటు చర్మాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు నానబెట్టిన పల్లీలు వరం అని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. పల్లీలు నానబెట్టి తీసుకోవడం వల్ల కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సంవృద్ధిగా అందుతాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. నానబెట్టిన వేరుశెనగలను బెల్లంతో కలిపి తింటే వెన్నునొప్పి తగ్గుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

