గ్యాస్ సబ్సిడీని నిరంతరాయంగా పొందాలనుకునేవారు మార్చి 31లోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. లేని పక్షంలో సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. స్మార్ట్ఫోన్లో ఆయిల్ కంపెనీ యాప్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ల సాయంతో ఇంట్లోనే సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఏవైనా సందేహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించవచ్చు.