AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బావంటే మోజు... అందుకే భర్తకు స్పాట్ వీడియో

బావంటే మోజు… అందుకే భర్తకు స్పాట్ వీడియో

Samatha J
|

Updated on: May 19, 2025 | 4:28 PM

Share

అయ్యో నా పతిదేవుడు కనిపించడం లేదంటూ కన్నీళ్లతో పోలీస్ స్టేషన్ ముట్టడెక్కించింది. నా భర్తను ఎలాగైనా మీరే వెతికి పెట్టాలని పోలీసులను వేడుకుంటుంది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తుండగా సార్లకు మేడం గారి యవ్వరము పైన తేడా కొట్టింది. స్టేషన్కు పిలిపించారు. తమ మార్కు ట్రీట్మెంట్ ఇవ్వడంతో నిజం బయటపడింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఏకంగా సుపారీ ఇచ్చి లేపేసింది. పాశ్చాత్య పోకడలతో సమాజం ఎటు వెళుతుందో రోజురోజుకు మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అగ్నిసాక్షిగా బంధువుల సమక్షంలో చేసుకున్న పెళ్ళిళ్లకు విలువే లేకుండా పోతుంది. కట్టుకున్న భార్యను కలకాలం కలిసి ఉండాల్సిన భర్తను విస్మరిస్తూ వివాహేతర సంబంధాలతో కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఫలితంగా కడుపున పుట్టిన పిల్లలు తమపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడు మరో వ్యక్తితో కలిసి హత్య చేసిందో భార్య. మెదక్ జిల్లా షామ్ నాపూర్ కు చెందిన మైలి శ్రీను గత నెల 16న అదృశ్యమయ్యాడు. కంగారుపడ్డ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శ్రీను దారుణ హత్యకు గురైనట్టు తెలిసింది. శ్రీనును చంపిందని లత, మల్లేష్, మోహన్ అని విచారణలో వెల్లడైంది. గత మూడు సంవత్సరాల క్రింద లత శ్రీనివాస్ అనే భార్యాభర్తలు మల్లేష్ తోని అఫైర్ ఉంది సార్ వాళ్ళకు. వాళ్ళకు లాటక ఉంది. ఇది గత మూడు సంవత్సరాల క్రింద మూడు సార్లు పంచాయితీ చేశాం సార్. మూడు సార్లు పంచాయితీ చేసినా మల్లేష్ తో అఫైర్ ఉందని చెప్పేసి డిక్లేర్ చేసింది లత. అయితే ఏమైంది సార్ ఆ మధ్యలో ఒక 16వ తేదీనాడు శ్రీనివాస్ మిస్ అయినాడు అని చెప్పేసి నేను లతను తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చాను.

మరిన్ని వీడియోల కోసం :

క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో

పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో

కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో