విమానంలో బొద్దింకలు.. షాక్‌లో ప్రయాణికులు వీడియో వైరల్
రెస్టారెంట్ లో బిర్యాని తింటుండగా బొద్దింక రావడం, కస్టమర్ ఫిర్యాదు చేయడం చూస్తూ ఉంటాం. మొన్న ఈ మధ్య విమానంలో వడ్డించిన ఆమ్లెట్ లో బొద్దింక వచ్చినట్లు ఓ ఎయిర్ ఇండియా ప్యాసింజర్ ఫిర్యాదు చేశారు. తాజాగా విమాన ప్రయాణంలో షాకింగ్ ఘటన ఎదురయింది. విమానం క్యాబిన్ గోడల మీద బొద్దింకలు పాకడం చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. బొద్దింకలు అంటే కొందరికి విపరీతమైన భయం. కిచెన్ లో బొద్దింక కనిపిస్తే చాలు బిగ్గరగా అరిచి గోల పడతారు. మళ్ళీ వంటగదిలోకి వెళ్లేందుకు నిరాకరిస్తారు. బొద్దింకలు ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాకు ఆవాసాలుగా ఉంటాయి. అందుకే స్ప్రే కొట్టి చంపేస్తూ ఉంటారు.
తాజాగా పరిశుభ్రతకు మారుపేరుగా ఉండే విమానంలో బొద్దింకలు ప్రత్యక్షమై ప్రయాణికులకు షాక్ ఇచ్చాయి. ఎక్కడినుంచి వచ్చాయో తెలియదు కానీ విమానం కిటికీ పైన సీటు పైన తిష్టా వేసుకొని కనిపించడంతో ప్రయాణికులు భయంతో లేచి ఎటు వెళ్ళాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. అమెరికాలోని విమానంలో బొద్దింకలు కనిపించిన వీడియోను సిమోన్ బీజ్ అనే ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. వీడియోపై స్పందించిన నెటిజన్లు స్ప్రిట్ ఎయిర్ లైన్స్ లోని మెయింటెనెన్స్ అద్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా కెప్టెన్ స్పందించకపోవడం ఏంటని మరికొందరు కామెంట్ చేశారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోలో సిమోన్ బీ ఈ ఘటనంతో కోపం విసుగు కలిగిందని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
