నువ్వు సూపరహే.. బ్రేకప్ చెప్పిన యువతికి షాక్.. తిన్న తిండి డబ్బులు ఇవ్వాలంటూ పెద్ద లిస్టే పంపించాడుగా
ప్రస్తుతం ప్రేమ అంటే ప్రేమించడం మరచిపోవడం యువత అనుకుంటున్నారు. కనుక నిజంగా ప్రేమించే వ్యక్తి దొరకడం చాలా అరుదు. చాలా మంది చిన్న చిన్న విషయాలకే గొడవపడి విడిపోతారు. అలా విడిపోయిన తర్వాత కొంతమంది తమకు రాసి పెట్టి లేదు అంటూ విధి రాతని అంగీకరించి వదిలేస్తారు. మరికొందరు ప్రతీకారం తీర్చుకుంటారు. అయితే ఇప్పుడు ఒక ప్రేమికుడు తన మాజీ ప్రియురాలి తిండికి ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగి షాక్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు ప్రేమికుడికి సపోర్ట్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రేమ అంటే నమ్మలేము అని అంటున్నారు. ప్రేమలో పడినప్పుడు.. ప్రేమించుకునే సమయంలో అంతా బాగానే ఉంటుంది. అప్పుడు తన ప్రియురాలు నోటి నుంచి ఏమి కావాలని వచ్చినా సరే.. డబ్బులకు లెక్క చేయకుండా ఖర్చు చేస్తారు. అమ్మాయిలకు బహుమతులను ఇస్తారు. ఏదైనా తినాలి అని ఉంది అన్న వెంటనే స్విగ్గీల్లో రకరకాల ఫుడ్ ని ఆర్డర్ పెడతారు. రకరకాల ప్రదేశాలకు తీసుకుని వెళ్తారు. ఒకరికి ఒకరం అని గడిపినంత కాలం ఈ డబ్బులు అదనపు ఖర్చు అని భావించరు. అయితే ఎప్పుడైతే అమ్మాయి వివిధ రీజన్స్ తో బ్రేకప్ చెబుతుంటే అక్కడే మొదలవుతుంది అసలు కథ.. ఇలా ఓ యువతి తన ప్రియుడికి గుడ్ బై చెప్పేసి.. తల్లిదండ్రులు చెప్పిన సంబంధానికి ఒకే చేసినట్లు ఉంది. దీంతో కడుపు మండిన ఆ ప్రియుడు ప్రియురాలికి ఓ రేంజ్ లో షాక్ ఇచ్చాడు.
తనని కాదని వేరే పెళ్లి చేసుకున్న అమ్మాయిని షాక్ మాజీ ప్రియుడు షాక్ ఇచ్చాడు. నీ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి చెల్లించమని లిస్టు పంపించాడు. ఆ యువతి తన మాజీ ప్రియుడు తనతో చేసిన చిట్ చాట్ కు సంబందించిన వాట్సాప్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అది వైరల్ అయింది.
ఆమె తన మాజీ ప్రియుడు @certifirdbkl అనే ఖాతాలో పంపిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. అందులో తన మాజీ ప్రియుడు తన కోసం ఖర్చు చేసిన డబ్బు చెల్లించమని అడుగుతున్నాడని రాసింది. అవును దివ్య అనే యువతి మాజీ ప్రేమికుడు.. పంపించిన లిస్టు ప్రకారం .. ఇద్దరూ ప్రేమించుకునే సమయంలో.. ఆమె స్విగ్గీ నుంచి రకరకాల ఫుడ్ ని ఆర్డర్ చేసింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను పంపించి డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నాడు. ఈ స్క్రీన్‌షాట్‌లో దివ్య స్పైసీ చిప్స్, శీతల పానీయాలు, డ్రై ఫ్రూట్స్‌తో సహా చాలా రకరకాల ఆహార పదార్ద్ఝాలను ఆర్డర్ పెట్టిన జాబితా చాలా పెద్దదిగా ఉంది. ఇందులో బిల్లులు కూడా ఉన్నాయి.
వైరల్ పోస్ట్ ఇక్కడ చూడండి:
my ex is asking a refund for the snacks he sent me during our relationship. What stage of the breakup is this? 😭 pic.twitter.com/4ra6pbSUS5
— divya (@certifiedbkl) May 14, 2025
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇప్పటికే 1.3 మిలియన్ల వ్యూస్, లైకులు, రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది. ఒక యూజర్ “ఈ అమ్మాయిలను నమ్మడం కష్టం” అని అన్నాడు. వారు ఎప్పుడు చేయి ఇస్తారో చెప్పలేమని కామెంట్ చేశారు. ఇంకొకరు ఇది నిజంగా అద్భుతం.. ఈ పోస్ట్ చూసిన తర్వాత.. ఏ అమ్మాయి అయినా తన ప్రేమికుడి డబ్బులు ఖర్చు చేయాలనుకుంటే ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు. మరొకరు “ఆర్యన్.. నువ్వు సూపర్.. మొత్తం పురుష సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది” అని వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




