AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: కొన్ని పరిస్థితుల్లో, కొందరి వ్యక్తులతో వద్దు చెప్పడం ముద్దే అంటున్న చాణక్య..

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మన జీవితాలకు ఉపయోగపడే అనేక విషయాల గురించి చెప్పాడు. ముఖ్యంగా జీవితంలోని ప్రతి అంశం గురించి, వివాహం గురించి, స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని ఆయన లోతుగా వివరించాడు. అంతేకాదు చాలా సందర్భాలలో ఇష్టం ఉన్నా లేకపోయినా మొహమాటం కోసం వద్దు అని చెప్పకుండా తరువాత అనుభవించే ఇబ్బందులు అనేకం. కనుక ఇలాంటి సందర్భంలో ఎదురయ్యే నిరాశ, కోపం అవమానాన్ని నివారించడానికి ముందుగానే 'వద్దు' అని చెప్పడం ముఖ్యమని చెప్పాడు చాణక్య

Chanakya Niti: కొన్ని పరిస్థితుల్లో, కొందరి వ్యక్తులతో వద్దు చెప్పడం ముద్దే అంటున్న చాణక్య..
Chanakya
Surya Kala
|

Updated on: May 21, 2025 | 10:13 AM

Share

జీవితంలో మనం ‘అవును’ అని చెప్పే పరిస్థితులు చాలా ఉన్నట్లే, ‘కాదు’ అని చెప్పాల్సిన పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. అయితే చాలా సార్లు మనం ఏదైనా పని చేసే మందు లేదా పనిని అంగీకరించే ఉచ్చులో పడిపోతాము. తరువాత కష్టపడతాము. అలాంటి ఇబ్బందుల బారిన పడకుండా ఉండాలంటే ‘వద్దు’ అని చెప్పడం ముఖ్యం. వద్దు అనే మాట వలన అనేక కష్టాల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. చాణక్యుడి ప్రకారం, కొన్ని సార్లు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం “వద్దు” అని చెప్పడం చాలా ముఖ్యం. చేస్తానని చెప్పి… దానిని నెరవేర్చడంలో విఫలమవడం కంటే అంగీకరించకముందే తిరస్కరించడం మంచిది. “వద్దు” అని చెప్పడం నిజాయితీకి సంకేతం. ఇది భవిష్యత్తులో ఒత్తిడి లేదా నిరాశను నివారించడానికి సహాయపడుతుంది. కనుక చాణక్య నీతి ప్రకారం ఎప్పుడు ‘వద్దు’ అని చెప్పాలో తెలుసుకోండి..

మనసులో ఒకలా ఆలోచిస్తూ బయట ఒకలా మాట్లాడేవారితో

మోసగాళ్ళు ఎవరో మీకు తెలుస్తుంది. వీళ్ళు మీ ముందు ఒక మాట చెప్పి, మీ వెనుక మరొకటి చేసే వాళ్ళు. లోపల మీకు హాని చేయాలని కోరుకునే వారు.. బాహ్యంగా మీ శ్రేయోభిలాషులుగా కనిపిస్తారు. ఇటువంటి వ్యక్తుల పట్ల జగ్రత్తగా ఉండాలి. వీరికి స్పష్టమైన సరిహద్దులను నిర్ణయించడం అవసరం. కనుక ఇలాంటి వారు ఏదైనా చెబితే మొహమాటం లేకుండా ముందుగానే వద్దు అని చెప్పడం అన్ని విధాలా శ్రేయస్కరం.

ఇచ్చిన హామీని నెరవేర్చలేనప్పుడు

అతిగా వాగ్దానాలు చేసి ఆ తర్వాత వాటిని నెరవేర్చడంలో విఫలమవడం వల్ల మీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది ఒత్తిడికి దారితీస్తుంది. మీరు మీ శక్తికి మించిన పనిగా భావించి .. దానిని నెరవేర్చలేకపోతే.. ముందుగానే మర్యాదగా తిరస్కరించడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి

కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీకు ఎదురవుతాయి. మీ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతే మీరు అవమానంగా భావించవచ్చు. అప్పుడు మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి “వద్దు” అని చెప్పడం అవసరం. కనుక మీ పరిమితులు మీకు తెలిస్తే ఇది సాధ్యమే. తిరస్కరించడం స్వార్థం కాదు.. మీ సమయం… శక్తిని కాపాడుకునే మార్గం.

అప్పు తీసుకుని తిరిగి చెల్లించని వారికి

నిజాయితీపరులైన రుణదాతలు తాము చెప్పిన వ్యవధిలోపు మీకు తిరిగి మీ డబ్బులను చెల్లిస్తారు. నిజాయితీ లేని వ్యక్తులు ఏదో ఒక కారణం చెప్పి సమయం వృధా చేస్తారు. అప్పు తీసుకున్న డబ్బులను ఎగవేసేందుకు తప్పుడు కారణాలు కూడా చెప్పవచ్చు. ఇలాంటి వ్యక్తి డబ్బులు అప్పు అడిగినప్పుడు మీరు నో చెప్పకపోతే.. మీరు ఖచ్చితంగా డబ్బును, మనశ్శాంతిని కోల్పోతారు.

వ్యక్తిగతంగా ఉపయోగించుకునే వారు

మిమ్మల్ని తమ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం చూపే వ్యక్తులుగా కొందరు భావిస్తారు. అలాంటి వ్యక్తుల సమస్యలను మీ సమస్యలుగా భావించడం మానేయండి. జీవించాలనే మీ సంకల్పాన్ని తగ్గించే వ్యక్తులతో కాకుండా మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తులుగా భావించేవారితో ఉండండి. నిరంతర డిమాండ్లతో మిమ్మల్ని బాధపెట్టే వారితో కాదు. ఎవరైనా మీ మంచి మనసుని అలుసుగా తీసుకుని నిరంతరం మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటున్నా.. లేదా వారికి సహాయం చేయమని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా.. అటువంటి వారితో బంధానికి ఒక గీతని గీయండి. వద్దు అని చెప్పండి.

అయితే ఇలా “వద్దు” అని చెప్పడం అవతలి వారిని కష్టపెట్టేదిగా ఉండాల్సిన అవసరం లేదు. మంచి మాటలతో మర్యాదగా వద్దు అని తిరస్కరించవచ్చు. ఇలా నో చెప్పేటప్పుడు నిజాయితీగా, సూటిగా ఉండండి. అవతలి వ్యక్తి అడిగిన అభ్యర్థనను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారో ఎదుటివారు ఇబ్బంది పడకుండా వివరించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు