AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ రెండు రోజులు పొరపాటున కూడా బట్టలు ఉతకవద్దు.. నాటి సంప్రదాయం వెనుక రీజన్ ఏమిటంటే

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం, ఇంట్లో పెట్టె వస్తువులు మాత్రమే కాదు.. బట్టలు ఉతికే విషయంలో కూడా వాస్తు చిట్కాలు ఉన్నాయి. వారంలో కొన్ని రోజులు బట్టలు ఉతకడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంటి శాంతి, ఆనందం, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీరు ఏ రోజుల్లో బట్టలు ఉతకకూడదు? ఎందుకు ఉతకకూడదు అని తెలుసుకుందాం..

Vastu Tips: ఈ రెండు రోజులు పొరపాటున కూడా బట్టలు ఉతకవద్దు.. నాటి సంప్రదాయం వెనుక రీజన్ ఏమిటంటే
Washing Clothes Vastu Tips
Surya Kala
|

Updated on: May 21, 2025 | 10:45 AM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిశకు, ప్రతి రోజుకు నిర్దిష్ట ప్రాముఖ్యత ఉంది. ప్రతి దిశకీ, ప్రతి రోజుకీ ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది. ఈ నేపధ్యంలో వాస్తు శాస్త్రంలో కొన్ని రోజులను పూజకు లేదా విశ్రాంతికి మాత్రమే అని పరిగణిస్తారు. అదే విధంగా కొన్ని ప్రత్యేక రోజుల్లో బట్టలు ఉతికితే.. ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి డబ్బులు నష్ట పోతారని.. ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయని నమ్మకం. ముఖ్యంగా గురువారం, శనివారం బట్టలు ఉతకడం అశుభంగా పరిగణించబడుతుంది. మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు, శనివారం శనిశ్వరుడికి సంబంధించిన రోజు. ఈ రెండు రోజులు మాసిన బట్టలు ఉతకడం వలన ఈ దేవతలకు ఆగ్రహం కలిగి ఆశీర్వాదం ఇవ్వరని నమ్మకం.

మంగళవారం ఎందుకు బట్టలు ఉతక వద్దంటే

కుజుడు అగ్ని, విధ్వంసక శక్తులతో సంబంధం కలిగి ఉన్నాడు. కనుక  మంగళవారం రోజున బట్టలు ఉతకడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుందని భావిస్తారు. ‘రాత్రి సమయంలో బట్టలు ఉతకకండి లేదా ఆరబెట్టకండి. సాయంత్రం సమయంలో మనం బట్టలు శుభ్రం చేసినప్పుడు, ఉతికినప్పుడు లేదా ఆరబెట్టినప్పుడు, ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని నమ్మకం. మంగళవారం బట్టలు ఉతకడం వల్ల లక్ష్మీదేవి కోపం వస్తుందని.. ఇంటి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు. నేటికీ చాలా కుటుంబాలలో మంగళవారం రోజున బట్టలు ఉతకడం లేదా ఇంటిని శుభ్ర పరచడం వంటివి చేయరు. ఇలా చేయడం ఆ ఇంటి శుభాన్ని కాపాడుకోవడానికి ఒక మార్గంగా పరిగణిస్తారు.

శనివారం బట్టలు ఉతకడం వల్ల పేదరికం ఎందుకు వస్తుంది?

శనివారం శనీశ్వరుడికి అంకితం చేయడిన రోజు. ఈ రోజున శనిశ్వరుడిని పూజిస్తారు. ఈ రోజు కర్మ, న్యాయం, కఠినత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు ఈ రోజున ఉపవాసం ఉండి దానాలు చేస్తారు. అయితే ఈ రోజున బట్టలు ఉతకడం వంటి పనులు చేస్తే, అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. దీనివల్ల జీవితంలో అడ్డంకులు, డబ్బు చిక్కుకోవడం, కోర్టు కేసులు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఇంట్లో ఇప్పటికే ఆర్థిక సమస్యలు ఉంటే.. శనివారం బట్టలు ఉతకడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది.

ఇవి కూడా చదవండి

నాటి సంప్రదాయం, నేటి ఆలోచన

నేటి కాలంలో చాలా మంది వీటిని మూఢనమ్మకాలుగా భావిస్తారు. అయితే నేటికీ చాలా ఇళ్లలో ఈ సంప్రదాయాలను పూర్తి భక్తితో నిర్వహిస్తున్నారు. చాలా మంది వాస్తు నిపుణులు ఈ నియమాలను ఆధ్యాత్మిక కారణాల వల్ల మాత్రమే కాదు మానసిక ప్రశాంతత, దినచర్యను నిర్వహించడానికి కూడా రూపొందించబడ్డాయని నమ్మకం. మనం కొంచెం నమ్మకంతో మనసు పెట్టి ఈ సంప్రదాయాలను అర్థం చేసుకుంటే.. జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం సులభం అవుతుంది

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్