Jupiter Transit 2025: గురు బలం.. ఆ రాశుల వారికి ఆదాయం, ఆరోగ్యం, ఆధ్మాత్మిక భాగ్యం..!
Guru Gochar 2025: గురువు ఆదాయానికే కాదు, ఆధ్యాత్మికతకు కూడా కారకుడు. గురు బలం లేనిదే ఆధ్యాత్మిక సాధనలో ఏమాత్రం పురోగతి ఉండదు. గురువు అనుకూలంగా ఉండే పక్షంలో ఆదాయం, ఆరోగ్యం, ఆధ్మాత్మిక భాగ్యం తప్పకుండా కలుగుతాయి. మరో ఒకటి రెండు రోజుల్లో మిథునంలో ప్రవేశిస్తున్న గురువు కొన్ని రాశులకు ఈ భాగ్యాలు కలిగించడం జరుగుతుంది. వచ్చే ఏడాది జూన్ 2 వరకూ మిథున రాశిలో కొనసాగే గురువు వల్ల మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, ధనూ రాశివారి జీవితాల్లో ఆధ్యాత్మికత వెల్లువెత్తుతుంది. మిథున రాశి ద్విస్వభావ రాశి అయినందువల్ల ఆదాయ వృద్ధికి, ఆధ్యాత్మిక సాధనకు సమాన ప్రాధాన్యం ఇస్తారు.

Guru Transit 2025
- మేషం: సాధారణంగా ఆధ్మాత్మిక చింతనకు దూరంగా ఉండే మేష రాశివారిలో మిథున రాశి గురువు వల్ల ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు బాగా వృద్ధి చెందుతాయి. ఈ రాశికి తృతీయ స్థానంలో ప్రవేశించిన గురువు ఆధ్యాత్మిక స్థానమైన తొమ్మిదవ స్థానాన్ని వీక్షించడం వల్ల ఈ రాశివారు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడిపే అవకాశం ఉంది. ఎక్కువగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన చేయడం జరుగుతుంది. తల్లితండ్రులతో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి.
- వృషభం: ఈ రాశికి ద్వితీయ (విద్య) స్థానమైన మిథున రాశిలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఆధ్మాత్మిక గ్రంథాలను పఠించడం ఎక్కువవుతుంది. ఉపదేశాలు, సత్సంగాలు, ప్రవచనాలకు ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, ధర్మ కార్యాల మీద ఆసక్తి కూడా పెరుగుతుంది. అనేక విధాలైన ఆధ్మాత్మిక సాధనలు చేసే అవకాశం ఉంది. పుణ్య క్షేత్రాలను, సాధువులు, సన్యాసులను ఎక్కువగా దర్శించుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
- మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడంతో పాటు ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశం కూడా ఉంది. తరచుగా పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం ఉంటుంది. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. దాన ధర్మాలకు, ఉచిత సహాయాలకు అవకాశం ఉంది. ప్రవచనాలు ఎక్కువగా వినడం, సత్సంగాలకు హాజరు కావడం, ఆధ్మాత్మిక సాధనలు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది.
- సింహం: ఈ రాశికి ఆదాయ వృద్ధి స్థానమైన లాభ స్థానంలో గురువు ప్రవేశించిన దగ్గర నుంచి ఆధ్యాత్మిక సాధన కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం ఎక్కువవుతుంది. ఆధ్మాత్మిక కార్యక్రమాలకు, దైవ కార్యాలకు హాజరు కావడంతో పాటు వాటి మీద ఖర్చు కూడా పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను, ఇష్టమైన ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తారు. మొక్కుబడులు తీర్చుకుంటారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల వంటి వాటికి ఆర్థికంగా సహాయం చేస్తారు.
- తుల: ఈ రాశికి ఆధ్యాత్మిక స్థానమైన తొమ్మిదవ రాశిలోకి గురువు ప్రవేశం వల్ల ఈ రాశివారిలో ఆధ్యా త్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాల్ని పఠించడం ఎక్కువవుతుంది. పూజలు, ప్రార్థనలకు సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తారు. తరచూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆదాయ వృద్ది ప్రయత్నాలతో పాటు, ఆధ్యాత్మిక సాధన ప్రయత్నాలను కూడా అధికం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. దైవ కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది.
- ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారిలో ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయ వృద్ధికి, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఒక పక్క ప్రయత్నాలు సాగిస్తూనే మరో పక్క ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధను పెంచుకుంటారు. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శించడంతో పాటు తరచూ పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. సత్సంగాలకు, ప్రవచనాలకు, భక్తి మార్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.









