AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Vrat: మీ తలరాతని మార్చే 40 రోజుల హనుమంతుడి వ్రతం.. నియమాలు, ప్రయోజనాలు ఏమిటంటే..

రామ భక్త హనుమంతుడిని కలియుగ దైవంగా భావించి పూజిస్తారు. భక్తుల సంకటనలు తీర్చే దైవం కనుక ఆయన్ని సంకట మోచానుడు అని కూడా పిలుస్తారు. అయితే హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి 40 రోజుల పాటు వ్రత దీక్ష తీసుకుంటారు. హనుమంతుడి అనుగ్రహం కోసం చేసే ఉపవాసం భక్తి,శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ 40 రోజుల దీక్ష సమయంలో ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం, పూజ చేస్తారు.సాత్విక ఆహారం తీసుకుంటారు.ఇది శారీరక, మానసిక బలాన్ని పెంచుతుంది. కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కోరికలను నెరవేరుస్తుంది.

Hanuman Vrat: మీ తలరాతని మార్చే 40 రోజుల హనుమంతుడి వ్రతం.. నియమాలు, ప్రయోజనాలు ఏమిటంటే..
Lord Hanuman Blessings]
Surya Kala
|

Updated on: May 22, 2025 | 6:30 AM

Share

హిందువులు హనుమంతుడిని బలం, భక్తి , విధేయతకు చిహ్నంగా భావిస్తారు… దైవంగా భావించి పూజిస్తారు. హనుమంతుడి భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి, ఆశీర్వాదాలు పొందడానికి వివిధ మతపరమైన ఆచారాలను నిర్వహిస్తారు. వీటిలో ఒక ముఖ్యమైన ఆచారం హనుమంతుని కోసం 40 రోజులు ఉపవాసం ఉండటం. ఈ ఉపవాసం భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. 40 రోజుల పాటు చేసే హనుమాన్ వ్రతం, భక్తులు హనుమంతుడి పట్ల తమ భక్తిని, అంకితభావాన్ని తెలియజేసే ఒక ప్రతిజ్ఞ కాలం. ఈ సమయంలో భక్తులు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి. అవి ఏమిటంటే..

హనుమంతుని 40 రోజుల పాటు ఉపవాసం ఉండటానికి నియమాలు?

ఈ 40 రోజుల పాటు ప్రతిరోజూ హనుమంతుడిని పూజించాలి. పువ్వులు, సింధూరాన్ని సమర్పించాలి. హనుమంతుడికి ఇష్టమైన శనగలు, అరటిపండ్లు వాటిని నైవేధ్యంగా సమర్పించాలి

హనుమాన్ చాలీసా పారాయణం

ఈ 40 రోజులు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా ముఖ్యం. కొంతమంది భక్తులు ప్రతిరోజూ అనేకసార్లు దీనిని పారాయణం చేస్తారు.

ఉపవాసం పాటించే వ్యక్తి సాత్విక ఆహారం తినాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి.

హనుమంతుడు బ్రహ్మచారి కనుక ఈ కాలంలో కొంతమంది భక్తులు బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది.

ఈ సమయంలో మీ శక్తి సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయడం కూడా ఈ ఉపవాసంలో ఒక ముఖ్యమైన భాగం.

40 రోజుల ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు

మత విశ్వాసాల ప్రకారం భక్తులు 40 రోజుల పాటు హనుమంతుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల శారీరక, మానసిక బలం పెరుగుతుందని నమ్ముతారు. హనుమంతుడు బలానికి ప్రతీక.. ఆయనను పూజించడం వల్ల ఆయన భక్తులకు కూడా బలం చేకూరుతుంది.40 రోజులు వ్రతం చేయడం వలన జీవితంలోని ఇబ్బందులు, అడ్డంకుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

ఈ ఉపవాసం భయం, ప్రతికూల ఆలోచనలను తొలగించడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. హనుమంతుడిని పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భక్తులు తమ ప్రత్యేక కోరికలు తీర్చుకోవడానికి కూడా ఈ ఉపవాసం పాటిస్తారు. నిర్మలమైన భక్తితో ఉపవాసం పాటించడం ద్వారా కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
2 సెకన్లలో 700 కిలో మీటర్ల స్పీడ్‌ అందుకున్న రైలు!
2 సెకన్లలో 700 కిలో మీటర్ల స్పీడ్‌ అందుకున్న రైలు!