AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs NZ: ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో తోపు.. కట్‌చేస్తే.. సొంత టీం పాలిట మాత్రం విలన్ భయ్యో..!

South Africa in ICC Knockouts: సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తొలి సెమీస్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే, ఓ సౌతాఫ్రికా ప్లేయర్ మాత్రం తన సొంత జట్టు పాలిట విలన్‌ల తయారయ్యాడు. దీంతో ఎంత భారీ స్కోర్ చేసినా, ఒక్క మ్యాచ్‌లోనూ గెలవకపోవడం గమనార్హం.

SA vs NZ: ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో తోపు.. కట్‌చేస్తే.. సొంత టీం పాలిట మాత్రం విలన్ భయ్యో..!
Sa Vs Nz
Venkata Chari
|

Updated on: Mar 04, 2026 | 6:01 PM

Share

David Miller ICC Knockout Scores: దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ (David Miller), ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో తన బ్యాటింగ్ పవర్ చూపిస్తున్నాడు. వివిధ టోర్నమెంట్‌లలో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లలో అతను సెంచరీలు, హాఫ్ సెంచరీలు బాదాడు. అయితే, దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లలో ఏవీ విజయానికి దారి తీయలేదు.

డేవిడ్ మిల్లర్ ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో సాధించిన కొన్ని ముఖ్యమైన స్కోర్లు:

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్: వర్సెస్ న్యూజిలాండ్ – 100* (67)

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్: వర్సెస్ భారత్ – 21 (17)

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్: వర్సెస్ ఆస్ట్రేలియా – 101 (116)

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2015 సెమీ ఫైనల్: వర్సెస్ న్యూజిలాండ్ – 49 (18)

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2014 సెమీ ఫైనల్: వర్సెస్ భారత్ – 23* (12)

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2013 సెమీ ఫైనల్: వర్సెస్ భారత్ – 56* (51)

డేవిడ్ మిల్లర్ ఈ ప్రదర్శన అతని వ్యక్తిగత ఆటతీరును నిరూపిస్తుంది. కానీ, జట్టు గెలవకపోవడం పట్ల అతను ఖచ్చితంగా నిరాశకు లోనవుతున్నాడు. ముఖ్యమైన మ్యాచ్‌లలో అతను ఆడే ఇన్నింగ్స్ జట్టు విజయానికి దారితీయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us