Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jatara: మేడారం జాతరకు ఏర్పాట్లలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క.!

Medaram Jatara: మేడారం జాతరకు ఏర్పాట్లలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క.!

Anil kumar poka

|

Updated on: Jan 02, 2024 | 4:33 PM

మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు మంత్రి సీతక్క. జిల్లా కలెక్టర్, SPతో కలిసి జాతర అభివృద్ధి పనులు పరిశీలించారామె. జంపన్నవాగుపై తెగిన లో లేవల్ కాజ్ వేలు.. మేడారానికి వెళ్ళే అన్ని రహదారులు వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు. పస్రా, తాడ్వాయి, మేడారం మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు సీతక్క. ఈసారి జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు సీతక్క.

మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు మంత్రి సీతక్క. జిల్లా కలెక్టర్, SPతో కలిసి జాతర అభివృద్ధి పనులు పరిశీలించారామె. జంపన్నవాగుపై తెగిన లో లేవల్ కాజ్ వేలు.. మేడారానికి వెళ్ళే అన్ని రహదారులు వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు. పస్రా, తాడ్వాయి, మేడారం మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు సీతక్క. ఈసారి జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు సీతక్క. ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు మహాజాతర జరుగనుంది.. ఈసారి జాతరకు కోటి 50 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.. ఆరు రాష్ట్రాల నుండి భక్తులు బారీగా తరలివస్తారని భావిస్తున్న ప్రభుత్వం తగిన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే 75 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.. వివిధ శాఖల వారిగా నిధులు విభజించి అభివృద్ది పనులు చేపట్టారు. ములుగు లోనే తిష్ట వేసిన మంత్రి సీతక్క అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ జాతర కోసం అభివృద్ది పనులు పర్యవేక్షిస్తూ.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. జంపన్నవాగుపై కొట్టుకుపోయిన లో లెవెల్ కాజ్.వే ల నిర్మాణం త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.. జాతర పనుల్లో ఏమాత్రం అలసత్వం వహించినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రహదారుల నిర్మాణం చిలకలగుట్ట వద్ద చేస్తున్న ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు..కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగురాష్ట్రాల నుండి జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్లు,డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీ, శానిటేషన్, హెల్త్ క్యాంపుల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రతపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.. జిల్లా కలెక్టర్, ITDA అధికారులు ఎప్పిటికప్పుడు పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.