పనిపై దృష్టి పెట్టాలన్నా, శరీరానికి తక్షణ శక్తిని, ఉత్తేజాన్ని అందించాలన్నా అందరికీ వెంటనే గుర్తు వచ్చేది వేడి వేడి కాఫీ కప్పు. అలాగే ఉదయం నిద్ర లేవగానే గుర్తుకొచ్చే మొదటి పానియం కూడా చాలా మందికి కాఫీనే
TV9 Telugu
రోజును ప్రారంభించడానికి, మధ్యాహ్నం వచ్చే అలసటను తగ్గించడానికి చాలా మంది కాఫీని ఆశ్రయిస్తారు. కాఫీలో ఉండే కెఫీన్ సహజ ఉద్దీపనగా పని చేసి ఏకాగ్రతను, శక్తి స్థాయిలను పెంచుతుంది
TV9 Telugu
కాఫీ తాగిన 10 నుంచి 15 నిమిషాల్లోనే శరీరంపై దాని ప్రభావం ప్రారంభమవుతుంది. కాఫీతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని ఎల్లప్పుడూ మితంగానే తీసుకోవాలి
TV9 Telugu
ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఉదయం సమయంలో శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కాఫీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి
TV9 Telugu
అందుకే నిద్ర లేచిన ఒక గంట తరువాత మొదటి కాఫీని తీసుకోవాలి. ఆ సమయంలో కార్టిసాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాఫీ ప్రభావం మెరుగ్గా ఉంటుంది
TV9 Telugu
అలాగే మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య సమయంలో కూడా చాలా మంది కాఫీ తాగుతూ ఉంటారు. ఆ సమయంలో కాఫీ తాగితే అలసట తగ్గి ఉత్పాదకత పెరుగుతుంది
TV9 Telugu
అయితే మధ్యాహ్నం తాగే కాఫీ రాత్రి నిద్రకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ప్రీ వర్కౌట్ డ్రింక్ గా కాఫీ తాగవచ్చు. వ్యాయామానికి 30 నుంచి 60 నిమిషాల ముందు కాఫీ తీసుకోవడం వల్ల రక్తంలో కెఫిన్ స్థాయిలు గరిష్ట స్థాయికి చేరుకుని శారీర పనితీరు మెరుగుపడుతుంది
TV9 Telugu
ఇక సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాఫీ తీసుకోకపోవడమే మంచిది. ఈ సమయాల్లో తాగే కాఫీ రాత్రి నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తుంది. అలాగే రోజుకు 2 నుండి 3 కప్పుల కాఫీని మాత్రమే తీసుకోవాలి