Tuesday Puja Tips: కుజ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. మంగళవారం ఈ పరిహారాలు చేసి చూడండి.. సుఖమైన జీవితం మీ సొంతం..

ఎవరి జాతకంలో కుజుడు స్థానం నీచ స్తితిలో ఉంటాడో .. వారి జీవితంలో ఇబ్బందులు, ప్రమాదాలు, కుటుంబ కలహాలు వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని బలోపేతం చేయడానికి కొన్ని చర్యలు సూచించబడ్డాయి. ఈ చర్యలను అనుసరిస్తే అతని జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. అంతేకాదు కుజుడు శుభ స్థానంలో ఉంటే.. నిందలు, భయం, సంక్షోభం, వ్యాధి, అనారోగ్యం మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

Tuesday Puja Tips: కుజ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. మంగళవారం ఈ పరిహారాలు చేసి చూడండి.. సుఖమైన జీవితం మీ సొంతం..
Mangal Dosha Puja Tips
Follow us

|

Updated on: Jan 02, 2024 | 7:57 AM

ఈరోజు మంగళవారం. ఈ రోజున హనుమంతుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు భూ దేవి పుత్రుడు అయిన అంగారకుడు (కుజుడు)కు అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అంగారకుడి స్వభావం ఉగ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలో కుజుడు స్థానం మంచిగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి, అంతేకాదు అతని జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతిని పొందుతాడు. అదే సముయంలో ఎవరి జాతకంలో కుజుడు స్థానం నీచ స్తితిలో ఉంటాడో .. వారి జీవితంలో ఇబ్బందులు, ప్రమాదాలు, కుటుంబ కలహాలు వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని బలోపేతం చేయడానికి కొన్ని చర్యలు సూచించబడ్డాయి. ఈ చర్యలను అనుసరిస్తే అతని జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. అంతేకాదు కుజుడు శుభ స్థానంలో ఉంటే.. నిందలు, భయం, సంక్షోభం, వ్యాధి, అనారోగ్యం మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ నేపధ్యంలో జాతకంలో కుజ దోషం ఉంటే మంగళ వారం కొన్ని చర్యలు చేయాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

కుజ దోషాన్ని తొలగించే మార్గాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు ఎర్రటి ఆవుకు బెల్లం ముక్కను ఆహారంలో కలిసి తినిపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా కుజ దోషం తొలగిపోతుంది. చేపట్టిన పనుల్లో సక్సెస్ అందుకుంటాడు. అన్ని పనుల్లో అభివృద్ధి చెందుతాడు. మంగళ దోషం ఉన్నవారు కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మంగళవారం నదిలో విడవాలి లేదా హనుమాన్ దేవాలయంలో ఉంచాలి. ఇలా ఏడు మంగళవారాలు నిరంతరాయంగా చేయాలి. మంగళవారం నాడు ఈ పరిహారాన్ని చేయడం ద్వారా.. జాతకంలో కుజుడు యొక్క స్థానం బలపడుతుంది. మంగళ దోషం తొలగిపోతుంది.

సమస్యలతో ఇబ్బంది పడుతుంటే..

మంగళవారం నాడు గోవులకు, కోతులకు సేవ చేయడం వల్ల జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది. ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలోని అన్ని సమస్యలు కూడా దూరమవుతాయి.

ఇవి కూడా చదవండి

ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసం

మంగళవారం నాడు హనుమంతుని ఆలయానికి వెళ్లి ఆయనను దర్శించుకుని బెల్లం, శనగలు, బూందీ సమర్పించాలి. అంతే కాకుండా కోతులకు బెల్లం, శనగలు తినిపించాలి. 21 మంగళవారాలు ఇలా చేయడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు తీరడం మాత్రమే కాదు జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు కూడా తెరవబడతాయి.

కుటుంబంలో ఆనందం, శాంతి కోసం

కుటుంబంలో అన్నయ్య ఆశీస్సులు మంగళ దేవుడి దీవెనలుగా పరిగణించబడతాయి. కుటుంబంలో సంతోషం, శాంతి కోసం, ప్రతి మంగళవారం ఇంట్లో అన్నయ్యకు స్వీట్లు తినిపించి ఆశీర్వాదం తీసుకోండి. ఒకవేళ ఎవరికైనా అన్నయ్య లేకపోతే అన్నయ్య వంటి వ్యక్తీ నుంచి ఆశీస్సులు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సోదరభావం పెరగడమే కాదు.. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది.

సంపద-శ్రేయస్సు కోసం

హనుమంతుడి ఆలయంలో మల్లెపూల నూనెను వెలిగించండి. ఎరుపు రంగులో ఉన్న వత్తితో దీపాన్ని ఏర్పాటు చేసుకుని అప్పుడు మల్లె నూనెతో దీపాన్ని వెలిగించండి. దీపాన్ని కుంకుమతో పూజించండి. అనంతరం ఆలయంలో సుందరకాండ పఠించండి. ఇలా 21 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల సిరి సంపదలు.. కలుగుతాయని.. అన్ని రకాల భయాలు తొలగిపోతాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!