EPFO: కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి కేంద్రం షాక్.. పీఎఫ్ అకౌంట్‌పై బ్యాడ్‌న్యూస్.. ఆ పథకం లేనట్లే..
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం షాకిస్తోంది. 2014 తర్వాత కొత్తగా ఈపీఎఫ్ చందాదారులుగా చేరినవారికి ఈపీఎస్ పథకం వర్తించడం లేదు. దీని వల్ల చాలామంది ఆ పథకానికి దూరమవుతున్నారు. దీంతో గరిష్ట వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచాలనే డిమాండ్లు ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.

ఈపీఎఫ్‌వో నిబంధనలు ఉద్యోగులకు శాపంగా మారుతున్నాయి. ఉద్యోగుల పింఛన్ పథకం(EPS) రూల్స్ వల్ల ఖాతాదారులకు నష్టం జరుగుతోంది. 2014 వరకు ఈపీఎఫ్‌వో గరిష్ట వేతన పరిమితి రూ.6 వేల వరకు ఉండగా.. ఆ ఏడాది నుంచి రూ.15 వేలకు పెంచుతూ కేంద్రం నిర్ణయ తీసుకుంది. అయితే 2014 సెప్టెంబర్ 1 తర్వాత రూ.15 వేలకు(బేసిక్+డీఏ) మించి శాలరీతో చేరివారికి ఈపీఎస్ స్కీమ్ వర్తించకుండా నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో డెత్, పించన్ క్లెయిమ్స్‌ను ఈపీఎఫ్‌వో తిరస్కరించింది. గరిష్ట వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచాలని ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీని వల్ల ఎక్కువమంది ఉద్యోగులు ఈపీఎస్ పరిధిలోకి వచ్చే అవకాశముంటుంది.
సాఫ్ట్‌వేర్‌లో జరగని మార్పులు
రూ.15 వేలకు మించి వేతనం తీసుకునేవారికి ఈపీఎస్ యాజమాన్యం కాంట్రిబ్యూషన్ బదిలీ చేయడానికి వీల్లేకుండా మార్గదర్శకాలు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. సాఫ్ట్‌వేర్‌లో మాత్రం మార్పులు చేయలేదు. దీంతో కంపెనీలు ఈపీఎస్‌ను ప్రత్యేక అకౌంట్‌లో జమ చేస్తున్నాయి. అయితే ఉద్యోగులు మరణించిన సమయంలో కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకుంటే ఈపీఎస్ పథకం వర్తించదని క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈపీఎస్ పథకానికి చాలామంది ఉద్యోగులు దూరమవుతున్నారు. ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత పొందలేకపోతున్నారు. కనీస వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచితే మరింతమంది ఉద్యోగులు ఈపీఎస్ పరిధిలోకి రానున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదు.
1.5 కోట్ల మంది దూరం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికిపైగా ఈపీఎఫ్ చందాదారులు ఉండగా.. రూ.15 వేల నిబంధన వల్ల వారితో 1.5 కోట్ల మంది ఈపీఎస్ పథకానికి దూరమవుతున్నారు. 2014 తర్వాత కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి నష్టం జరుగుతుతోంది. కాగా 1952లో కనీస వేతన పరిమితి రూ.300లో ఉండగా.. 1957కు రూ.500కు, 1962కు రూ.వెయ్యి, 1976కు రూ.1600, 1985కు రూ.2500, 1990కు రూ.3500, 1994కు రూ.5 వేలకు పెంచారు. ఇక 2001లో రూ.6,500కు పెంచగా.. 2014 నుంచి రూ.15 వేల వేతన పరిమితి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా నగరాల్లో కనీస వేతనాలు రూ.20 వేల వరకు ఉన్నాయి. దీంతో ఈపీఎఫ్‌వో గరిష్ట వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టులో కూడా దీనిపై పిటిషన్ దాఖలు అయింది. దీంతో గరిష్ట వేతన పరిమితిని పెంచడంపై మూడు నెలల్లోగా అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్రం త్వరలో వేతన పరిమితిన పెంచుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
