Money Horoscope 2024: ఆరు గ్రహాలు అనుకూలం.. 2024లో ఆ రాశుల వారికి అపర కుబేర యోగం పక్కా..!
ఏకంగా ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండడమనేది ఎంతో అరుదు. అటువంటిది ఈ ఏడాది అయిదు రాశుల వారికి ఈ విధంగా ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండడం జరగబోతోంది. శని, గురు, రాహు, కేతు, శుక్ర, కుజులు బాగా అనుకూలంగా ఉంటున్నందువల్ల ఈ అయిదు రాశుల వారు తప్పకుండా ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. పైగా సహజ ధన స్థానమైన వృషభ రాశిలోకి సహజ ధన కారకుడైన గురువు ఏప్రిల్ నెలాఖరులో ప్రవేశించిన దగ్గర నుంచి విపరీతమైన ధన దాహం ఏర్పడుతుంది.
ఏ రాశికైనా ఏకంగా ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండడమనేది ఎంతో అరుదు. అటువంటిది ఈ ఏడాది అయిదు రాశుల వారికి ఈ విధంగా ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండడం జరగబోతోంది. శని, గురు, రాహు, కేతు, శుక్ర, కుజులు బాగా అనుకూలంగా ఉంటున్నందువల్ల ఈ అయిదు రాశుల వారు తప్పకుండా ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. పైగా సహజ ధన స్థానమైన వృషభ రాశిలోకి సహజ ధన కారకుడైన గురువు ఏప్రిల్ నెలాఖరులో ప్రవేశించిన దగ్గర నుంచి విపరీతమైన ధన దాహం ఏర్పడుతుంది. వృషభ రాశిలో గురువు తన సహజసిద్ధమైన ఆధ్యాత్మిక చింతనను, పెద్దరికాన్ని, ఆత్మ సంతృప్తిని పక్కన పెట్టి ధన వ్యామోహాన్ని సంతరించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మేషం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి ఏప్రిల్ నుంచి తప్పకుండా ఈ అపర కుబేర యోగం పట్టబోతోంది. గురువు తోడ్పాటుతో అందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది.
- మేషం: ఈ రాశివారికి ఏప్రిల్ 30న ధన స్థానంలో ప్రవేశించబోతున్న గురువు కారణంగా దాదాపు ‘పట్టిం దల్లా బంగారం అవుతుంది’. ఈ రాశివారికి అధికార దాహానికి తోడు ధన దాహం కూడా బాగా పెరుగుతుంది. ‘ఏదో విధంగా’ డబ్బు సంపాదించడం మొదలవుతుంది. ఒక పక్క వృత్తి, ఉద్యో గాలు చేస్తూనే మరో ఆదాయ మార్గాన్ని అనుసరించడం తప్పకుండా జరుగుతుంది. జీవిత భాగ స్వామికి మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.
- సింహం: ఈ రాశివారికి ఈ ఏడాది చివరి లోగా రెండు మూడుసార్లు ధన యోగం పట్టే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందడంతో పాటు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. తండ్రి వైపు నుంచి తప్పకుండా ఆస్తి కలిసి వస్తుంది. ఈ రాశికి చెందిన డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగంవారు, లిక్కర్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. దాదాపు రెండు చేతులా సంపాదించడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడు, భాగ్య స్థానంలో ప్రవేశిస్తున్న గురువుతో పాటు, శుక్ర, బుధ, రాహువులు కూడా బాగా అనుకూలంగా మారుతుండడంతో అతి వేగంగా ఆర్థికాభి వృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మారుమూల స్థలం కూడా కోట్ల రూపాయల విలువకు చేరుకుంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
- ధనుస్సు: ఈ రాశినాథుడైన గురువు సహజ ధన స్థానమైన వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారు తప్పకుండా ఆర్థికాభివృద్ధికి విశేషమైన కృషి చేసే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి కారణంగా తప్పకుండా వీరి ఆర్థిక ప్రయత్నాలన్నీ అంచనాలకు మించి విజయం సాధి స్తాయి. డబ్బు సంపాదించడమే పరమావధిగా మారుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహిం చని విధంగా ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరించడం కూడా జరుగుతుంది.
- మకరం: ఈ రాశివారికి రాశ్యధిపతి శనీశ్వరుడు ధన స్థానంలోనే ఉండడం, ధన కారకుడైన గురువు పంచమ స్థానంలో, అంటే ఆలోచనా స్థానంలో ప్రవేశించడం వల్ల, ధన సంపాదనే ఏకైక లక్ష్యంగా మారడం జరుగుతుంది. ఏప్రిల్ 30 తర్వాత నుంచి వీరి సంపాదన మార్గాలు మరింతగా విస్తరించే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు విజయాలు సాధించడంతో పాటు ఆకస్మిక ధన లాభానికి, స్త్రీ మూలక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. లాటరీలు, స్పెక్యులేషన్లు, షేర్లు బాగా లాభిస్తాయి.