Horoscope Today: వారికి అనుకూలంగా ఆదాయ పరిస్థితి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 2, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థాయిలో ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి అనుకూలంగా ఆదాయ పరిస్థితి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
Horoscope Today 02nd January 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 02, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 2, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థాయిలో ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారులతో సత్సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థాయిలో ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవా లేదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. తోబుట్టువులను ఇంటికి ఆహ్వానిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి తగ్గుతుంది. వ్యాపారాల్లో కొత్తగా కొన్ని మార్పులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు తీరుబడిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవ హారాలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. సతీమణితో కలిసి విలువైన వస్తువులు కొను గోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశిం చిన ప్రతిఫలం ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఒకటి రెండు శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్య క్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. కుటుంబంతో కలిసి కొన్ని ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు వెడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. బంధువుల నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగంలో జీత భత్యాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవు తాయి. మొత్తం మీద ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తల దూర్చకపోవడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే, సంపాదనకు లోటు ఉండదు. నిరుద్యోగుల శ్రమ ఫలించి, మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహ ప్రయ త్నాలు అనుకూలిస్తాయి. పిల్లల నుంచి, జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ధన లాభ సూచనలు న్నాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అనారోగ్యం నుంచి చాలావరకు బయటపడతారు. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయానికి లోటుండదు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

మనసులోని కోరికలు నెరవేరుతాయి. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కొందరు మిత్రుల కారణంగా తప్పటడుగు వేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొం టారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అధికారుల అండదండలతో ఉద్యోగులు సమర్థవంతంగా ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరు ద్యోగుల ప్రయత్నాలు ఫలించి మంచి ఆఫర్లు అందివస్తాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవు తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న ఒకటి రెండు ముఖ్య మైన పనుల్ని పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. స్థాన చలన సూచన లున్నాయి. కొన్ని అత్యవసర కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు.