Sun-Shani: సూర్యుడు, శనీశ్వరుడు తండ్రికొడుకులే.. అయితే ఒకరికొకరు ప్రత్యర్థులే.. పురాణాల కథనం ఏమిటంటే..

శనీశ్వరుడు కర్మ ప్రధాత. మానవుల కర్మలకు ఆధారంగా తగిన శిక్షలను అందిస్తాడు. అందుకనే శనీశ్వరుడిని న్యాయమూర్తి అని పిలుస్తారు. శనీశ్వరుడు  తప్పును సహించడు.. అందుకే తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు. కనుక శనీశ్వరుడిని న్యాయాధికారి అని కూడా పిలుస్తారు. వాస్తవానికి శనీశ్వరుడు సూర్య భగవానుడి కొడుకు. అయితే తండ్రీ కొడుకుల మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు లేవు. ఇద్దరూ ఒకరికొకరు ఎలా ప్రత్యర్థులుగా మారారనేది ఒక పౌరాణిక కథలో చెప్పబడింది. కాశీ ఖండంలో చెప్పబడిన కథ ప్రకారం.. భగవంతుడు విశ్వకర్మ కుమార్తె 'సంధ్య'ను గ్రహాల రాజు 'సూర్యదేవుడు' వివాహం చేసుకున్నాడు.

Sun-Shani: సూర్యుడు, శనీశ్వరుడు తండ్రికొడుకులే.. అయితే ఒకరికొకరు ప్రత్యర్థులే.. పురాణాల కథనం ఏమిటంటే..
Lord Sun Shaniswara
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2024 | 12:59 PM

ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు, శనీశ్వరుడు మధ్య తండ్రీ కొడుకుల సంబంధం ఉంది.  అంతేకాదు వీరిద్దరికి నవగ్రహాల్లో ప్రముఖ స్థానం ఉంది. అయితే సూర్యుడు, శనీశ్వరుడికి మధ్య తండ్రీకొడుకుల మధ్య ఉండే ప్రేమ బంధం కంటే శత్రుత్వం అధికంగా ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భానుడు తొమ్మిది గ్రహాలకు రాజుగా పరిగణించబడుతున్నాడు. అదే సమయంలో శనీశ్వరుడు కర్మ ప్రధాత. మానవుల కర్మలకు ఆధారంగా తగిన శిక్షలను అందిస్తాడు. అందుకనే శనీశ్వరుడిని న్యాయమూర్తి అని పిలుస్తారు. శనీశ్వరుడు  తప్పును సహించడు.. అందుకే తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు. కనుక శనీశ్వరుడిని న్యాయాధికారి అని కూడా పిలుస్తారు. వాస్తవానికి శనీశ్వరుడు సూర్య భగవానుడి కొడుకు. అయితే తండ్రీ కొడుకుల మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు లేవు.

తండ్రి తనయుల మధ్య రిలేషన్ ఎలా ఉందంటే

మంచి సంబంధాలు ఎందుకు లేవు? ఇద్దరూ ఒకరికొకరు ఎలా ప్రత్యర్థులుగా మారారనేది ఒక పౌరాణిక కథలో చెప్పబడింది. కాశీ ఖండంలో చెప్పబడిన కథ ప్రకారం.. భగవంతుడు విశ్వకర్మ కుమార్తె ‘సంధ్య’ను గ్రహాల రాజు ‘సూర్యదేవుడు’ వివాహం చేసుకున్నాడు. సమస్త ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యభగవానుని ప్రకాశానికి సంధ్య ఎంతగానో భయపడేది. పెళ్లయిన కొంతకాలానికి సూర్యదేవ్, సంధ్య దంపతులకు మను, యముడు,  యమునా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ సంధ్య సూర్యభగవానుడి ప్రకాశాన్ని తట్టుకోలేకపోయింది.

సూర్యుని ప్రకాశాన్ని తట్టుకోలేక సంధ్య తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ఆమె తన ఛాయకు ప్రాణం పోసింది. సంధ్య తన పిల్లలను చూసుకునే బాధ్యతను ఛాయకి అప్పగించి తన తండ్రి ఇంటికి వెళ్ళింది. మరో వైపు సంధ్యను తండ్రి ఆదుకోకపోవడంతో ఆమె అడవిలో మగరూపం ధరించి తపస్సులో మునిగిపోయింది. మరోవైపు  ఛాయా నీడ కావడంతో సూర్యభగవానుడి ప్రకాశానికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు.

ఇవి కూడా చదవండి

ఛాయా దేవిని అవమానించిన సూర్యుడు

పౌరాణిక విశ్వాసాల ప్రకారం శనీశ్వరుడు ఛాయ గర్భంలో ఉన్నప్పుడు.. ఛాయ శివుని కోసం తీవ్రమైన తపస్సు చేసింది. తపస్సు చేసే సమయంలో ఆకలి, దాహం, సూర్యరశ్మి, వేడిమి తట్టుకోలేక ఛాయ గర్భంలో పెరుగుతున్న శనీశ్వరుడి పై కూడా ప్రభావం చూపించడంతో ఛాయ నల్లగా మారిపోయింది. శనిదేవుడు జన్మించినప్పుడు.. అతని ఛాయను చూసి సూర్యదేవుడు ఛాయాను అనుమానించాడు. అంతేకాదు ఛాయాదేవికి, శనీశ్వరుడిని అవమానించాడు. అంతేకాదు శనీశ్వరుడు ఎన్నడూ తన కొడుకు కాలేడని చెప్పాడు. అయితే తల్లి తపస్సు శక్తి  ప్రభావం శనీశ్వరుడిపై పడింది. తన తల్లిని అవమానించడం చూసిన శనీశ్వరుడు కోపంతో తన తండ్రి సూర్యదేవుని వైపు చూశాడు. అప్పుడు సూర్యదేవుడు పూర్తిగా నల్లబడ్డాడు. అంతేకాదు రథం కదలిక కూడా ఆగిపోయింది.

సూర్యుడు తనను రక్షించమంటూ శివుడిని ఆశ్రయించాడు. అప్పుడు శివుడు .. సూర్యుడికి తిరిగి అసలు రూపాన్ని అందించాడు. అలా తండ్రి తనయుల మధ్య ప్రేమకు బదులు శత్రుత్వం ఏర్పడింది.  తండ్రీ కొడుకుల మధ్య మధురమైన సంబంధానికి బదులు సూర్యభగవానుడు, శని మధ్య ఎప్పుడూ శత్రుత్వం ఉంటుంది.

శివుని కోసం కఠోరమైన తపస్సు  చేసిన శనీశ్వరుడు

తన తల్లిని అవమానించిన తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవడానికి శనీశ్వరుడు కఠోర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తప్పస్సుకు మెచ్చిన శివుడు ఏదైనా వరం కోరుకోమని అడగగా.. తన తండ్రి సూర్యుడు తన తల్లి ఛాయను అగౌరవపరిచాడని, తనను హింసించాడని చెప్పాడు. కనుక తనను తండ్రి సూర్యుని కంటే శక్తివంతంగా, పూజనీయంగా ఉండేటట్లు అనుగ్రహించమని వరం అడిగాడు. అప్పుడు శివుడు తొమ్మిది గ్రహాల్లో అత్యుత్తమ స్థానం పొందడంతో పాటు.. కర్మల ఆధారంగా శిక్షించే అధికారాన్ని వరంగా ఇచ్చాడు.

అంతేకాదు సామాన్య మానవులే కాదు, దేవతలు, రాక్షసులు, సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు, నాగులు అందరూ నీ పేరు వింటే భయపడతారని చెప్పాడు శివయ్య. అప్పటి నుండి శనిశ్వరుడు నవ గ్రహాలలో అత్యంత శక్తివంతమైనవాడు.. కేవలం దృష్టితోనే విజయాలను ఇచ్చేవాడిగా పూజించబడుతున్నాడు. శనీశ్వరుడు చేతిలో ఒక అద్భుతమైన ఇనుప ఆయుధం ఉంది. ఎవరిపైన అయినా శనీశ్వరుడికి అనుగ్రహం కలిగితే పేదవాడిని రాజుగా మార్చగలడు. అదే సమయంలో ఎవరిపైన అయినా కోపం కలిగితే రాజును సైతం  పేదవాడిగా మార్చగలడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు