New Year 2024: ఈ రోజు శివయ్య అనుగ్రహం కోసం ఈ వస్తువులను దానం చేయండి.. ఇంట్లో సుఖ సంతోషాలు మీ సొంతం..

ఏడాదిలో కొన్ని ప్రత్యేక రోజుల్లో చేసే దానాలు పూజలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మనిషికి ఉన్న అన్ని రకాల సమస్యలు దూరమై విశేష ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు సోమవారం. సోమవారం శివుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ నూతన సంవత్సర శుభ సందర్భంగా కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా, శివుడు సంతోషిస్తాడు. శివయ్య ఆశీర్వాదం ఏడాది పొడవునా మీ పై ఉంటుంది. 

New Year 2024: ఈ రోజు శివయ్య అనుగ్రహం కోసం ఈ వస్తువులను దానం చేయండి.. ఇంట్లో సుఖ సంతోషాలు మీ సొంతం..
New Year 2024
Follow us
Surya Kala

| Edited By: TV9 Telugu

Updated on: Jan 02, 2024 | 12:09 PM

హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది. దానవులను కూడ దేవతలుగా మార్చేది దాన గుణమే.. అందుకే దాతృత్వ విశిష్టత గురించి  అనేక పురాణ కథలు ఉన్నాయి. దానం మతానికి అనుసంధానించడమే కాదు.. జీవితంలోని అన్ని సమస్యల నుండి బయటపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దానం చేయడం వల్ల  కష్ట, నష్టాలు పోయి జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. అన్ని రకాల దానాలు వ్యక్తికి పుణ్యాన్ని ఇస్తాయని విశ్వాసం. కర్మల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.

ముఖ్యంగా ఏడాదిలో కొన్ని ప్రత్యేక రోజుల్లో చేసే దానాలు పూజలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మనిషికి ఉన్న అన్ని రకాల సమస్యలు దూరమై విశేష ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు సోమవారం. సోమవారం శివుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ నూతన సంవత్సర శుభ సందర్భంగా కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా, శివుడు సంతోషిస్తాడు. శివయ్య ఆశీర్వాదం ఏడాది పొడవునా మీ పై ఉంటుంది.

నూతన సంవత్సరంలో  వీటిని దానం చేయండి

కొన్ని రకాల వస్తువులను దానం చేయడం హిందూ మత గ్రంధాలలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

గోశాలకు విరాళం

హిందూ మతంలో ఆవును తల్లిగా భావిస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా  ఇంటికి సమీపంలో ఉన్న ఏదైనా గోశాలకు దానం చేయండి. ఆవుకు ఆహారాన్ని అందించండి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. గోశాలకు దానం చేయడం వల్ల కుటుంబంలో సుఖం, శాంతి నెలకొంటుంది.

బుక్స్ డొనేషన్

న్యూ ఇయర్ సందర్భంగాపేద పిల్లలకు పుస్తకాలను విరాళంగా ఇవ్వండి. పుస్తకాలు దానం చేయడం లేదా విద్య దానం చేయడం వల్ల చదువు పెరుగుతుందని, సరస్వతీ దేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అందువల్ల  నూతన సంవత్సరం సందర్భంగా పుస్తకం, పెన్నులను అవసరం ఉన్నవారికి అందించండి. ఇవ్వండి.

ఆహార దానం

నూతన సంవత్సరం సందర్భంగా నిరుపేదలకు,  ఆకలిగా ఉన్నవారికి ఆహారాన్ని పంపిణీ చేయండి. ఈ రోజు అన్నదానం చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై జీవితం ఐశ్వర్యంతో నిండిపోతుంది.

వస్త్ర దానం

వస్త్ర దానం చేయడం అనేది ఒక వ్యక్తి జీవితంలో విజయానికి మూలం. నిర్మలమైన హృదయంతో  సంతోషంగా బట్టలు దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో కష్టాలు తొలగిపోతాయని, పెండింగ్‌లో ఉన్న పనులు మళ్ళీ ముందుకు కదులుతాయని చెబుతారు. కనుక నూతన సంవత్సరం సందర్భంగా వస్త్ర దానం చేయండి.

నువ్వుల దానం

హిందూ మతంలో నువ్వులు, నవ ధాన్యాల దానం చేయడం వంటి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నువ్వులను దానం చేయడం వలన కష్టాలు,  విపత్తుల నుండి  రక్షణ లభిస్తుందని.. ఆనందాన్ని కలిగిస్తుందని విశ్వాసం.  కనుక ఈ రోజు నువ్వులను దానం  చేయండి.

ఉప్పు దానం

ఉప్పును దానం చేయడం వల్ల ప్రత్యక్ష, పరోక్ష సమస్యలనుంచి విముక్తి లభిస్తాయి. ఉప్పును దానం చేయడం ఉత్తమంగా పరిగణించబడుతుంది. నూతన సంవత్సరంలో ఉప్పును దానం చేయడం శుభప్రదం అని విశ్వాసం.

బెల్లం దానం

వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే లేదా ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే,  ప్రతి సోమవారం బెల్లం దానం చేయడం ఫలవంతం. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య ఉన్న  సమస్యలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు