Telangana: పోలీస్ స్టేషన్‌కు వాస్తు దోషం..10 నెలల కాలంలో 11 మంది ఎస్ఐలు బదిలీ.. నివారణ చర్యలు మొదలు ..

హైదరాబాద్‌- నాగార్జున సాగర్‌ రహదారిపై ఉన్న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌కు క్రేజ్ ఏర్పడింది. పోటీపడి రాజకీయ నేతల సిఫార్సు లేఖలతో పోస్టింగ్స్ తెప్పించుకుంటారు. మంచి పోలీస్ స్టేషన్ అనుకొని డ్యూటీలో చేరిన ఎస్‌ఐలు కొన్ని నెలలకే అనూహ్యంగా వివాదాలలో చిక్కు కుంటున్నారు. క్లీన్‌ చిట్‌తో స్టేషన్‌ ఎస్‌ఐగా వచ్చిన పలువురు అనుకోకుండా పలు కేసుల్లో జోక్యం చేసుకోవడం, భూ తాగాదాల్లో తలదూర్చడం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ పని చేసిన పలువురు ఎస్‌ఐలు వివాదాలతో బదిలీ అవుతున్నారు.

Telangana: పోలీస్ స్టేషన్‌కు వాస్తు దోషం..10 నెలల కాలంలో 11 మంది ఎస్ఐలు బదిలీ.. నివారణ చర్యలు మొదలు ..
Telangana Police
Follow us
M Revan Reddy

| Edited By: Surya Kala

Updated on: Jan 01, 2024 | 10:18 AM

పోలీసు శాఖలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించేందుకు పోలీసులు పోటీ పడుతుంటారు. హైవేల మీద ఉన్న పోలీస్ స్టేషన్లకు క్రేజ్ ఉండడంతో ఎస్ఐ పోస్టింగ్స్ డిమాండ్ ఉంటుంది. రాజకీయ నేతల సిఫార్సు లేఖలతో పోస్టింగ్స్ తెప్పించుకుంటారు. కానీ హైవే మీద ఉన్న ఆ పోలీస్ స్టేషన్ కు మాత్రం ఎస్సైగా రావాలంటే జంకుతున్నారు. పది నెలల వ్యవధిలో 11 మంది బదిలీ ఎస్సైలు బదిలీ అయ్యారు. ఎస్సైలు ఎందుకు బదిలీ అవుతున్నారు..? ఆ పోలీసు స్టేషన్ కు వాస్తు దోషం పట్టుకుందా…? అయితే పోలీసులు ఏం చేశారు..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీస్ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహించేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక్కడ పని చేసేందుకు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎస్‌ఐలు పోటీ పడుతుంటారు. దీంతో హైదరాబాద్‌- నాగార్జున సాగర్‌ రహదారిపై ఉన్న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌కు క్రేజ్ ఏర్పడింది. పోటీపడి రాజకీయ నేతల సిఫార్సు లేఖలతో పోస్టింగ్స్ తెప్పించుకుంటారు. మంచి పోలీస్ స్టేషన్ అనుకొని డ్యూటీలో చేరిన ఎస్‌ఐలు కొన్ని నెలలకే అనూహ్యంగా వివాదాలలో చిక్కు కుంటున్నారు. క్లీన్‌ చిట్‌తో స్టేషన్‌ ఎస్‌ఐగా వచ్చిన పలువురు అనుకోకుండా పలు కేసుల్లో జోక్యం చేసుకోవడం, భూ తాగాదాల్లో తలదూర్చడం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ పని చేసిన పలువురు ఎస్‌ఐలు వివాదాలతో బదిలీ అవుతున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పది నెలల వ్యవధిలో 11 మంది ఎస్‌ఐలు వేర్వేరు కారణాలతో బదిలీ అయ్యారు.

స్టేషన్ కు వాస్తు దోషం..

చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసిన పలువురు ఎస్‌ఐలు వివాదాలతో బదిలీ అవుతుండడంతో స్టేషన్‌కు వాస్తు దోషం భయం పట్టుకుందని పోలీస్ శాఖలో జోరుగా చర్చ సాగుతోంది. దీంతో వాస్తు దోషాన్ని సరిచేసే పనిలో పోలీస్ అధికారులు పడ్డారు. స్టేషన్‌కు వాస్తు దోషం లేకుండా చేసేందుకు అధికారులు స్టేషన్‌ ముందు భాగాన్ని కూల్చివేశారు. ఈ స్టేషన్ లో చోటు చేసుకుంటున్న ఇటీవలి పరిణామాలు పోలీస్ శాఖలో గుబులు పుట్టిస్తున్నాయి. చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు రావాలంటేనే ఎస్‌ఐలు జంకుతున్నారు. స్టేషన్ ముందు గోడను కూల్చడంతోనైనా స్టేషన్ కు పట్టిన వాస్తు దోషం ఇప్పుడైనా తొలగుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..