AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్స్.. రెండున్నర గంటల్లోనే 1060 కేసులు

కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి డ్రంకన్ డ్రైవ్ చెకింగ్‌లు చేశారు. సిటీ పరిధిలోని పబ్‌లు, బార్లు, రిసార్ట్స్ వద్ద పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్లు మినహా3 కమిషనరేట్లలోని అన్ని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలను మూసివేశారు. 59 ట్రాఫిక్ పీఎస్‌లలో మొత్తం 260 చెక్ పాయింట్ల వద్ద..

Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్స్.. రెండున్నర గంటల్లోనే 1060 కేసులు
Drunken Drive Case
Srilakshmi C
|

Updated on: Jan 01, 2024 | 9:53 AM

Share

హైదరాబాద్, జనవరి 1: కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి డ్రంకన్ డ్రైవ్ చెకింగ్‌లు చేశారు. సిటీ పరిధిలోని పబ్‌లు, బార్లు, రిసార్ట్స్ వద్ద పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్లు మినహా3 కమిషనరేట్లలోని అన్ని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలను మూసివేశారు. 59 ట్రాఫిక్ పీఎస్‌లలో మొత్తం 260 చెక్ పాయింట్ల వద్ద ముమ్మర తనిఖీలు చేశారు. టీ న్యాబ్ పోలీసులు డ్రగ్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించారు. నక్లెస్ రోడ్స్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్‌వైపు రహదారులను మూసివేసినప్పటికీ సెక్రటేరియట్ వద్దకు యువకులు భారీగా చేరారు. దీంతో పోలీసులు సైతం క్రౌడ్‌ను కట్టడి చేయలేక చేతులు ఎత్తివేశారు.

మరోవైపు డ్రగ్ టెస్టుల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోని పబ్స్, బార్లు, రెస్టారెంట్‌లలో పోలీసులు మఫ్టీలో వెళ్లి తనిఖీలు చేపట్టారు. స్నిప్పర్ డాగ్స్ ను కూడా తమ వెంట తీసుకెళ్లారు. నిబందనలు ఎంతవరకు పాటిస్తున్నారనే దానిపై పరిశీలించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారి కోసం సెర్చ్ చేశారు. చెక్ పాయింట్స్ వద్ద 3 కమిషనరేట్ల పరిధిలో డ్రగ్స్ టెస్టులు చేశారు. దీంతో రాత్రి 11.30 గంటల వ్యవధిలోనే అంటే కేవలం రెండున్నర గంటల్లోనే మొత్తం 1060 కేసులు నమోదు చేశారు. పోలీసుల తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ సప్లయర్లు పట్టుబడ్డారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు, డ్రగ్ టెస్టుల కేసుల వివరాలను ఈ రోజు మీడియా సమక్షంలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఏపీలో మరో ఘటన.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేస్తవారపేట పంచాయతీ పాపాయిపల్లికి చెందిన పవన్‌ (20), శ్రీనివాస్‌ (21), రాహుల్‌ (21) ముగ్గురూ ద్విచక్ర వాహనంపై పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వైపుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గిద్దలూరు నుంచి బేస్తవారపేట వైపు వస్తున్న బొలెరో వాహనం వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా?
మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా?
మనసును కదిలించే జ్ఞాపకం.. విజయ్ వాహనాలకు 0277 నంబర్ ఎందుకంటే..
మనసును కదిలించే జ్ఞాపకం.. విజయ్ వాహనాలకు 0277 నంబర్ ఎందుకంటే..
మీ ముక్క ఆకారమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే
మీ ముక్క ఆకారమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే
ఎంత కష్టపడని పని చేసినా డబ్బు నిలవట్లేదా? కారణాలు ఇవే!
ఎంత కష్టపడని పని చేసినా డబ్బు నిలవట్లేదా? కారణాలు ఇవే!
D-Mart: డి-మార్ట్‌లో అత్యధిక జీతం పొందే ఉద్యోగి ఎవరు? ఆ జీతం ఎంతో
D-Mart: డి-మార్ట్‌లో అత్యధిక జీతం పొందే ఉద్యోగి ఎవరు? ఆ జీతం ఎంతో
ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం!
ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం!
గోల్డెన్ రాశులివే.. త్వరలో బంగారం కొనుగోలు, పెట్టుబడులకు బెస్ట్
గోల్డెన్ రాశులివే.. త్వరలో బంగారం కొనుగోలు, పెట్టుబడులకు బెస్ట్
ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు AP MLA
ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు AP MLA
సమ్మర్ హీట్‌కి గుడ్‌బై! 10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టాప్ ట్రా
సమ్మర్ హీట్‌కి గుడ్‌బై! 10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టాప్ ట్రా
యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన..
యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన..