AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విద్యార్థులను క్షమిస్తున్నా.. వారికి మార్గనిర్దేశం అవసరం: ప్రధాని మోదీ

తనను, దివంగత తల్లిని దూషించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని కోరుతూ, జీరో ఎఫ్‌ఐఆర్ నేపథ్యం లో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ విద్యార్థులను క్షమిస్తున్నా.. వారికి మార్గనిర్దేశం అవసరం: ప్రధాని మోదీ
Pm Modi
SN Pasha
|

Updated on: Aug 01, 2026 | 9:01 AM

Share

కొంతమంది పిల్లలు తనను, తన దివంగత తల్లిని దూషించారని, అయితే వారు మిస్ గైడ్ అయిన విద్యార్థులని అందుకే తాను వారిని క్షమిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శిక్షించడం లేదా సుదీర్ఘ న్యాయపరమైన చర్యలకు గురిచేయడం కంటే వారికి సరైన మార్గనిర్దేశం చేయడం సమాజ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసిన వీడియో సందేశంలో మోదీ స్పందించారు.

నిరసనలో కొంతమంది ఉపయోగించిన భాష ఏ నాగరిక సమాజానికీ తగినది కాదని ప్రధాని అన్నారు. తనను మాత్రమే కాకుండా తన దివంగత తల్లిని కూడా అత్యంత అభ్యంతరకరమైన పదజాలంతో దూషించారని చెప్పారు. అయితే, అలాంటి ఘటనలపై ప్రతీకారం తీర్చుకోవడం కంటే, వారు ఎందుకు అలా ప్రవర్తించారో అర్థం చేసుకుని వారికి సరైన దిశలో మార్గనిర్దేశం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

వీడియో చూడండి

“వీరు దారి తప్పిన పిల్లలు. వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం లేదా సమాజంలో అవమానించడం వల్ల పరిస్థితులు మారవు. వారిని సరిదిద్దేందుకు మనం ప్రయత్నించాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఒక ఉపమానం కూడా చెప్పారు. “కొన్నిసార్లు మన నాలుక పొరపాటున పళ్ల కిందకు వచ్చి గాయమవుతుంది. కానీ అందుకని మనం పళ్లను విరగ్గొట్టం. ఎందుకంటే పళ్లు కూడా మనవే, నాలుక కూడా మనదే. అలాగే పిల్లలు కూడా మన సమాజానికే చెందినవారు. వారి తప్పులను సరిదిద్దడం మన బాధ్యత” అని ప్రధాని వివరించారు. విద్యార్థులు గత ఘటనలను మరిచి దేశాభివృద్ధి కోసం ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. “పిల్లలారా, మనమందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. కొత్త విషయాలు నేర్చుకుందాం. తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకుందాం. నేను మీ భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నాను” అని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!