AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు

భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ లో చర్చలు జరిగాయి. ఇరువురు నేతలు వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు వంటి పలు కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించడంపై విస్తృతంగాచర్చించారు.

PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు
Pm Modi Donald Trump Phone Call
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Sep 30, 2026 | 9:20 PM

Share

భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా తాజాగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో కీలక చర్చలు జరిపారు. ఈ ఫోన్ కాల్‌కు సంబంధించిన వివరాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, అమెరికా అధ్యక్షుడితో జరిపిన సంభాషణ ఎంతో సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. భారత్–అమెరికా సమగ్ర గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాల నాయకులు పూర్తి అంగీకారం తెలిపారు.

రెండు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.కేవలం ద్వైపాక్షిక అంశాలే కాకుండా, ప్రస్తుత ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ శాంతి, భద్రతలను పెంపొందించడానికి కొనసాగుతున్న ఉమ్మడి ప్రయత్నాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు.

అంతర్జాతీయ స్థిరత్వాన్ని కాపాడటంలో భారత్-అమెరికా దేశాల భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనూ పరస్పర సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us