మాయదారి డైట్.. సోషల్ మీడియా డాక్టర్ల మాయలో జనాలు.. అసలు ఏం తినాలి? ఏం తాగాలి?
ఒకాయన వస్తే అన్నం మానేసి కొబ్బరినూనె తాగమంటాడు.. ఇంకొకాయన వచ్చి పక్షుల్లా గింజలు మాత్రమే తినమంటాడు.. ఆఖరికి చెట్ల ఆకులు కూడా తినేయమంటూ సోషల్ మీడియాలో హాఫ్ నాలెడ్జ్ డాక్టర్లు పుట్టుకొచ్చారు.. అసలు డిగ్రీ లేదు, స్టెతస్కోప్ లేదు.. చేతిలో ఫోన్ ఉంటే చాలు వైద్యులైపోతున్నారు. వాళ్ల రీల్స్ నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న జనం ఎందరో.. తాజాగా ప్రముఖ డైటీషియన్ వీరమాచినేని రామకృష్ణపై పోలీసు కేసు నమోదు కావడం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతోంది. అసలు ఈ సోషల్ మీడియా డైట్ల వెనుక ఉన్న అసలు దందా ఏంటి? మనం ఏం తినాలో ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వో ఏం చెబుతున్నాయి? అనేది తెలుసుకుందాం..

పార్వతి శివుడి ప్రత్యక్షం కోసం ఘోర తపస్సు చేసింది. ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేసినా శంకరుడు కరుణించకపోయే సరికి.. ఆ ఆకులు తినడం కూడా మానేసింది. అందుకే పార్వతికి అపర్ణ అనే పేరు. ఇప్పుడెందుకీ కథ అనా.. జామ ఆకులు తింటే సకల రోగాలూ పోతాయని వాట్సాప్ విశ్వవిద్యాలయం వారు సెలవిస్తే.. దాన్ని యూట్యూబ్ డాక్టర్లు ప్రమోట్ చేశారు కాబట్టి. జామ ఆకుల గురించి అలా చెప్పారో లేదో.. 50 జామఆకులను 200 రూపాయలకు అమ్ముతున్నారు ఆన్‌లైన్‌లో. సీరియస్లీ.. కావాలంటే చెక్ చేయండి. 100 గ్రాముల ఎండుటాకులు 100 రూపాయలు. పావు కిలో ఎండు జామ ఆకుల పొడి 250 రూపాయలు. జస్ట్ బికాజ్ ఆఫ్.. ఈ సోకాల్డ్ సోషల్ మీడియా డాక్టర్లే ఈ పిచ్చి. ఆయనెవరో చెబితే అన్నం మాని పచ్చి కూరలు తింటున్నారు. ఇంకొకాయన చెబితే అన్నం మాని పక్షుల్లా సిరిధాన్యాలు తీసుకుంటున్నారు. ఎవరో దానయ్య చెప్పాడని రొట్టెలు మొదలుపెట్టారు. ఆశ్రమంలో స్వామి చెబితే పండ్లు తినడం స్టార్ట్ చేశారు. ఓనమాలు రాని యూట్యూబర్లు చెబితే ఆఖరికి ఆకులు అలములు కూడా తింటున్నారు. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొలెస్ట్రాల్ పేరు చెప్పి రకరకాల డైట్ ప్లాన్లను పుట్టిస్తున్నారు. ఒంటిపై తెల్లకోటు, మెడలో స్టెథస్కోపు, డాక్టర్ అనే డిగ్రీ.. ఇవేవీ లేకుండా వైద్యులు పుట్టుకొస్తున్నారు. ఒక్క ఈమెయిల్ అడ్రస్ ఉంటే చాలు.. దాంతో యూట్యూబ్ చానెల్ పెట్టేసి, ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసేసి,...
