AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘CO2 గన్ పెట్టుకోండి’.. మహిళలకు మేజర్ ఖుష్బూ పటానీ సలహా వైరల్!

మహిళలు తమ భద్రత కోసం ఎవరిపైనా ఆధారపడకూడదు..అవసరమైతే ఆత్మరక్షణ కోసం సిద్ధంగా ఉండాలి. మాజీ ఆర్మీ అధికారిణి, నటి దిశా పటానీ సోదరి మేజర్ ఖుష్బూ పటానీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అయితే ఆమె చెప్పిన ఆత్మరక్షణ మార్గం ఎయిర్ పిస్టల్! మహిళలు తమ వెంట ఎయిర్ పిస్టల్ పెట్టుకోవాలన్న ఖుష్బూ పటానీ సలహా వివాదాస్పదం అవుతోంది

‘CO2 గన్ పెట్టుకోండి’.. మహిళలకు మేజర్ ఖుష్బూ పటానీ సలహా వైరల్!
Major Khushboo Patani Is Actress Disha Patanis Sister
Sharada V
|

Updated on: Sep 30, 2026 | 4:48 PM

Share

ఒక వీడియోలో పాయింట్ 177 కాలిబర్ ఉన్న ఎయిర్ పిస్టల్‌ను చూపిస్తూ.. మహిళలు పిస్టల్‌ను ఎలా వాడాలో శిక్షణ తీసుకోవాలని ఆమె సూచించారు. షూటింగ్ రేంజ్‌లో ప్రాక్టీస్ చేయాలని కూడా చెప్పారు. అయితే ఇక్కడే మరో ప్రశ్న మొదలైంది. మహిళలు తమ భద్రత కోసం గన్‌ చేతిలో పెట్టుకోవడం నిజంగా పరిష్కారమా? లేక అది మరో ప్రమాదానికి దారితీస్తుందా?

అసలు ఖుష్బూ పటానీ ఎందుకు ఈ సలహా ఇచ్చారు?

ఇటీవల మహిళలు, బాలికలపై వేధింపులు, లైంగిక దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఖుష్బూ పటానీ ఓ వీడియోను షేర్ చేశారు. మహిళలు తమ భద్రత విషయంలో ఇతరులపై పూర్తిగా ఆధారపడకూడదని.. ఆత్మరక్షణకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలని ఆమె సందేశం ఇచ్చారు. అయితే వీడియోలో ఆమె చూపించినది సాధారణ తుపాకీ కాదు. CO2తో పనిచేసే ఎయిర్ పిస్టల్. ఇది సంప్రదాయ తుపాకీలా గన్‌పౌడర్‌తో నిండిన బుల్లెట్లు పేలవు. CO2 గ్యాస్ సహాయంతో బుల్లెట్ల స్థానంలో పెల్లెట్లు దూసుకుపోతాయి.

ఎయిర్ పిస్టల్ కూడా ప్రమాదకరమే!

ఎయిర్ గన్‌లో సంప్రదాయ తుపాకీ బుల్లెట్ లేకపోయినా.. దాని నుంచి వెలువడే ప్రాజెక్టైల్ తీవ్రంగా గాయపరుస్తుంది. ముఖ్యంగా సరైన శిక్షణ లేకుండా ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖుష్బూ పటానీ వీడియోపై కొందరు మాజీ సైనిక అధికారులు, రక్షణ నిపుణులు కూడా విమర్శలు చేశారు. ముఖ్యంగా ట్రిగ్గర్ డిసిప్లిన్, అంటే తుపాకీని పట్టుకున్నప్పుడు ట్రిగ్గర్ విషయంలో పాటించాల్సిన ప్రాథమిక భద్రతా నియమాలపై ప్రశ్నలు వచ్చాయి. రక్షణ నిపుణుడు, రిటైర్డ్ వింగ్ కమాండర్ పుష్కల్ విజయ్ ద్వివేది ఈ సూచనను తీవ్రంగా విమర్శించారు. మరో రిటైర్డ్ మేజర్ మాణిక్ ఎం. జాలీ కూడా మహిళలు ఎయిర్ పిస్టల్‌పై ఆధారపడటంపై హెచ్చరికలు చేశారు.

Actress Disha Patani Sister Is Major Khushboo Patani

Actress Disha Patani Sister Is Major Khushboo Patani

అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది!

చేతిలో ఆయుధం ఉందనే భావన మహిళకు కొంత ధైర్యాన్ని ఇవ్వొచ్చు. కానీ అత్యవసర పరిస్థితిలో భయం, ఆందోళన, గందరగోళం మధ్య దాన్ని ఎలా వాడాలి అన్నది సరిగ్గా తెలియకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు..మహిళ వద్ద ఆయుధం కనిపిస్తే ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఎలా మారుతుందో కూడా ముందుగా చెప్పలేం అంటున్నారు.

ఎయిర్ పిస్టల్ కొంటే లైసెన్స్ అవసరం లేదా?

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. భారతదేశంలో అన్ని ఎయిర్ గన్స్‌కు ఒకే రకమైన నిబంధనలు వర్తించవు. Arms Rules, 2016 ప్రకారం.. మజిల్ ఎనర్జీ 20 జూల్స్‌ కంటే ఎక్కువ లేదా బోర్ 0.177 అంగుళాలు అంటే 4.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న కొన్ని ఎయిర్ వెపన్స్‌కు లైసెన్స్ అవసరం. ఈ పరిమితుల కంటే తక్కువగా ఉన్న ఎయిర్ వెపన్స్‌కు ఆయుధ లైసెన్స్ అవసరం లేకపోయినా.. వాటి విక్రయం, కొనుగోలు విషయంలో నిబంధనలు ఉన్నాయి. అధీకృత ఎయిర్-వెపన్ డీలర్ల ద్వారా విక్రయం జరగాలి. కొనుగోలుదారుడి గుర్తింపు, నివాస వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఎయిర్ పిస్టల్ కు ఎలాంటి చట్టపరమైన నిబంధనలు ఉండవు అనుకోవడం సరైంది కాదు.

మహిళల భద్రతకు అసలు పరిష్కారం ఏంటి?

ఖుష్బూ పటానీ చెప్పిన అసలు ఉద్దేశం..మహిళలు తమ భద్రత విషయంలో మరింత స్వయం ఆధారితంగా ఉండాలన్నది. ఆ ఆలోచనపై చర్చ జరగొచ్చు. కానీ ఆత్మరక్షణ అంటే కేవలం ఆయుధం పట్టుకోవడం మాత్రమే కాదు. పరిస్థితిని ముందుగానే గుర్తించడం, ప్రమాదకర ప్రదేశాలను నివారించడం, అత్యవసర సమయంలో సహాయం కోరడం, చట్టపరమైన మార్గాలపై అవగాహన, అవసరమైన ఆత్మరక్షణ శిక్షణ వంటి అంశాలు అందులో భాగమే. ఇక బహిరంగ ప్రదేశాల్లో భద్రత విషయంలో వ్యవస్థల బాధ్యత కూడా కీలకం. ఇటీవల ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నమోదైన అత్యాచార ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం పై ఉన్నప్పుడు వారేం చేస్తున్నారని కోర్టు సీరియస్ అయింది.

చివరికి ప్రశ్న ఒక్కటే…

మహిళలు సురక్షితంగా ఉండటానికి తమ వెంట ఒక గన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? ఆత్మరక్షణ కోసం మహిళలు సిద్ధంగా ఉండాలి అన్న సందేశం ఒక వైపు… ఆ ఆయుధాన్ని ఎలా, ఎప్పుడు, ఎంత బాధ్యతగా నిర్వహించాలన్న ప్రశ్న మరోవైపు…ఖుష్బూ పటానీ వీడియో ఈ రెండు అంశాలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. మహిళలకు భద్రత ఉన్న వాతావరణం కల్పించడం కుటుంబం, సమాజం, పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థల బాధ్యత.

Follow Us
‘CO2 గన్ పెట్టుకోండి’.. మహిళలకు మేజర్ ఖుష్బూ పటానీ సలహా వైరల్!
‘CO2 గన్ పెట్టుకోండి’.. మహిళలకు మేజర్ ఖుష్బూ పటానీ సలహా వైరల్!
ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది.. బయటకు వెళ్లేదెవరో!
ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది.. బయటకు వెళ్లేదెవరో!
ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా?
ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా?
హీరోయిన్లను మించిన ఫాలోయింగ్.. హీరోలకే షాకిచ్చిన గ్లామర్ క్వీన్ ఆ
హీరోయిన్లను మించిన ఫాలోయింగ్.. హీరోలకే షాకిచ్చిన గ్లామర్ క్వీన్ ఆ
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్..
విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్..
కుంభరాశి అక్టోబర్ ఫలితాలు..పాత రహస్యాలు వెళ్లడి..బంధంలో కొత్తమలపు
కుంభరాశి అక్టోబర్ ఫలితాలు..పాత రహస్యాలు వెళ్లడి..బంధంలో కొత్తమలపు
త్వరలోనే రంగంలోకి స్మార్ట్ ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్..
త్వరలోనే రంగంలోకి స్మార్ట్ ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్..
యమహా లవర్స్‌కు షాక్.. ఆ పాపులర్ బైక్‌ బైక్ నిలిపివేత?
యమహా లవర్స్‌కు షాక్.. ఆ పాపులర్ బైక్‌ బైక్ నిలిపివేత?
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము